Good News : ప్రభుత్వం ఉద్యోగులను ప్రోత్సహించేందుకు యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఏడాది పాటు పెయిడ్ హాలీడేస్ తీసుకోవచ్చని ప్రకటించింది.
Air India Express Issues Covid Guidelines For Travellers From UAE To India: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి. చైనాలో భారీగా కేసులు, మరణాలు నమోదు అవుతుండటంతో పలు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీట్మెంట్ ఫార్ములాతో ముందుకెళ్లాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు.
Guinnis Record: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వినోదానికి పెద్ద పీట వేస్తున్నారు. అందుకే ప్రజల అభిరుచి తగిన విధంగా పార్కుల్లో నిర్వాహకులు అడ్వంచెర్ రైడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ స్లైడ్స్ నుండి డ్రాప్ టవర్ల వరకు ప్రజలు ఈ రైడ్‌లను ఆస్వాదిస్తున్నారు. ఈ రైడ్‌లలో సాహసోపేతమైన రోలర్ కోస్టర్ కచ్చితంగా ఉంటుంది. ఈ థ్రిల్లింగ్ రైడ్‌ని ప్రయత్నించడానికి చాలా మంది భయపడుతుండగా, చాలా మంది ప్రజలు రోలర్ కోస్టర్ వేగానికి ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ఈ ఏడాది…
Dubai's new Hindu temple set to open ahead of Dussehra: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో హిందూ ఆలయం ప్రారంభం కానుంది. దుబాయ్ లో కొత్తగా నిర్మించిన ఈ ఆలయం దసరా ముందు రోజు మంగళవారం ప్రారంభం కానుంది. దుబాయ్ లోని జెబెల్ అలీ ప్రాంతంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. 2020లో శంకుస్థాపన జరిగిన ఈ దేవాలయం రెండేళ్ల తరువాత నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ కొత్త దేవాలయం గతంలో ఉన్న సింధీ గురుదర్భార్…
Pakistan delegation on secret visit to Israel: ఉప్పు నిప్పుగా ఉండే పాకిస్తాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు చిగురించే అవకాశం కనిపిస్తోంది. ఓ ముస్లిం దేశంగా పాకిస్తాన్ మరో ముస్లిం దేశం అయిన పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ.. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ తో దౌత్యసంబంధాలను పెట్టుకోలేదు. అయితే ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో భారత చిరకాల మిత్రదేశం అయిన ఇజ్రాయిల్ తో పాకిస్తాన్ సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతోంది.
Most millionaires in these cities: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సంపన్నులు ఎక్కువగా నగరాల్లోనే నివసిస్తున్నారు. ఎక్కువ మంది మిలియనీర్లు ఉంటున్న టాప్ -10 నగరాల్లో సగం అమెరికాలోనే ఉన్నాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్ పార్ట్‌నర్స్ గ్రూప్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం న్యూయార్క్, టోక్యో, శాన్ ప్రాన్సిస్కో బే ఏరియాల్లో అత్యధిక మంది మిలియనీర్లు నివసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
third monkeypox confirmed in kerala: ప్రపంచాన్ని మంకీపాక్స్ వ్యాధి వణికిస్తోంది. ఇప్పటికే 70 పైగా దేశాల్లో 14 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఇటీవల భారత్ లో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చింది. తాజాగా దేశంలో మూడో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు కాగా.. మూడో కేసు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదు అయింది. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 35…
ఎయిర్‌టెల్‌లో 1.2 శాతం వాటా గూగుల్‌కి. ముందుగా ప్రకటించినట్లుగానే ప్రముఖ సెర్చింజన్ గూగుల్ భారతీఎయిర్‌టెల్‌తో పార్ట్నర్‌షిప్ కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్‌లో 1.2 శాతం వాటాను దక్కించుకుంది. ఒక్కో షేరుకు 734 రూపాయల చొప్పున 71 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. ఈ మేరకు గూగుల్ 700 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు భారతీఎయిర్‌టెల్ సెబీకి తెలిపింది. ఆర్బీఐ క్రెడిట్, డిపాజిట్ల వెల్లడి క్రెడిట్ మరియు డిపాజిట్ల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. క్రెడిట్ 13.29 శాతం పెరగటంతో…
ఇండియాలో మరోసారి మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదు అయింది. ఇటీవల బ్రిటన్ నుంచి పశ్చిమ బెంగాల్ కు వచ్చిన మిడ్నాపూర్ వాసికి ఒళ్లంతా దద్దర్లతో కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో చేరడం ఆందోళన పెంచింది. అయితే తాజాగా మరో అనుమానిత కేసు కేరళలో నమోదు అయింది. గతంలో కూడా నిఫా, కరోనా వంటి కేసులు ముందుగా కేరళలోనే బయటపడ్డాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి ఇటీవల కేరళలోకి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు…