కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కానీ ఈ ఏడాది భారత్ లో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ ను ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలి అనే విషయంలో ఆలోచనలో పడింది. అయితే భారత్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహణ ఇండియాలో సాధ్యపడుతుందా? లేదా? అనేది స్పష్టం చేయాలని ఐసీసీ ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి భారత్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహించగలదా… లేదా అనే విషయంపై నివేదికను అందజేయాలని బీసీసీఐ అధినేత సౌరవ్…
కరోనా కారణంగా గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో భారత్ లో ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది అలాగే ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఈ ఏడాది సీజన్ ను అర్ధాంతరంగా నిలిపివేసింది. అయితే లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లను సెప్టెంబర్ – అక్టోబర్‌లో బీసీసీఐ పూర్తి చేయాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి.…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ప్రఖ్యాత భవనాలపై భారత త్రివర్ణ పతాకం మెరిసింది. ఇండియాలో కోవిడ్ -19 కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశానికి సంఘీభావంగా యూఏఈలోని పలు ప్రసిద్ధ భవనాలపై ఆదివారం భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, అబుదాబిలోని అడ్నోక్ ప్రధాన కార్యాలయాలు భారత జెండాతో వెలిగిపోయాయి. ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అంటూ అక్కడ ప్రదర్శించిన భారత త్రివర్ణ పతాకం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇండియా ఇన్ యూఏఈ’…