అంతరిక్షంలో మరో చారిత్రక అడుగు వేయడానికి యూఏఈ సిద్ధమైంది. అరబ్ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి ఏప్రిల్ 28న మొదటి అంతరిక్ష నడకకు(స్పేస్ వాక్) చేపట్టిన మొదటి అరబ్ వ్యోమగామిగా రికార్డు సృష్టించనున్నాడు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గురువారం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.
ఉపాధి కోసం విదేశీలకు వెళ్లిన భారతీయులు జైలు పాలవుతున్నారు. విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల సంఖ్య భారీగా ఉంది. తెలిసో తెలియకో చేసిన తప్పులకు జైళ్లలో కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం విదేశీ జైళ్లలో మొత్తం 8,437 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో నగరవ్యాప్తంగా అత్తర్ విక్రయించే దుకాణాలు భారీగా వెలుస్తున్నాయి. ప్రజలు తమ చేతులకు అత్తర్‌ను పూయడం, అత్తర్ సరైనదాన్ని ఎంచుకోవడానికి సువాసనను చూసి నచ్చిన అత్తర్ ను ఎంచుకుంటుంటారు.
Air Taxi: సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఓలా, ఉబర్ ట్యాక్సీలు జనాల్లోకి చొచ్చుకెళ్లాయి. త్వరలోనే కార్ల స్థానంలోకి కారు ఫ్లైట్స్ రాబోతున్నాయి.
Indian Citizenship: వృత్తి, ఉద్యోగరీత్యా ఇతర దేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2022లో 2,25,620 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రకటించింది. పార్లమెంట్ లో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులపై అడిగిన ఓ ప్రశ్నకు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.
Four-Day Work Week: ప్రపంచంలోని చాలా దేశాలు వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని కలిగి ఉన్నాయి. కానీ కొన్ని దేశాలు నాలుగు రోజుల పని వారం షెడ్యూల్‌ను ఆమోదించాయి.
Good News : ప్రభుత్వం ఉద్యోగులను ప్రోత్సహించేందుకు యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఏడాది పాటు పెయిడ్ హాలీడేస్ తీసుకోవచ్చని ప్రకటించింది.
Air India Express Issues Covid Guidelines For Travellers From UAE To India: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి. చైనాలో భారీగా కేసులు, మరణాలు నమోదు అవుతుండటంతో పలు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీట్మెంట్ ఫార్ములాతో ముందుకెళ్లాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు.