Air India Express Issues Covid Guidelines For Travellers From UAE To India: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి. చైనాలో భారీగా కేసులు, మరణాలు నమోదు అవుతుండటంతో పలు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీట్మెంట్ ఫార్ములాతో ముందుకెళ్లాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు.
Read Also: Russia: యూరోపియన్ దేశాలకు పుతిన్ షాక్.. ఇక ఆ దేశాలకు ఇంధన కష్టాలు..
ఇదిలా ఉంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి భారతదేశానికి ప్రయాణించే ప్రయాణికులకు కోవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది ప్రముఖ ఎయిర్ లైన్ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్. కోవిడ్ కు వ్యాక్సినేషన్ వేయించుకుని ఇమ్యూనిటీ పొందాలని సిఫారసు చేసింది. ప్రయానికలు ప్రయాణించేటప్పుడు తప్పకుండా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని సూచించింది. 12 ఏళ్ల లోపు పిల్లకలు పోస్ట్-అరైవల్ పరీక్షలు అవసరం లేదని తెలిపింది. అయితే పిల్లలకు ఎలాంటి లక్షణాలు కనిపించానా.. వారు ప్రోటోకాల్ కు అనుగునంగా పరీక్షలు చేయించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
దేశంలో కోవిడ్ ముందుజాగ్రత్తలో భాగంగా అంతర్జాతీయ విమానాల్లో వచ్చే ప్రయాణీకుల్లో రెండు శాతం మందికి ర్యాండమ్ టెస్టులు చేయాలని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ పాజిటివ్ రిజల్ట్స్ వస్తే వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని సూచించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, యూఎస్ఏతో సహా వివిధ దేశాల్లో ఇటీవలి కాలంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులలో ప్రభుత్వం ర్యాండమ్ గా ఆర్టీపీసీఆర్ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గతవారం లోక్ సభలో తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ కొచ్చి కేంద్రంగా మిడిల్ ఈస్ట్ కు ఎయిర్ లైన్ సేవలను అందిస్తోంది.