Good News for Drinkers : మందుబాబులకు మత్తెక్కించే న్యూస్.. ఇక పై ఎంత కావాలంటే అంత తాగేయొచ్చు.. ఖర్చుకు వెనకాడాల్సిన పనేలేదు. గవర్నమెంట్ మందుపై ట్యాక్స్ పూర్తిగా రద్దు చేసింది. ఇంకేముంది ఇక లగెత్తండి షాపుల వద్దకు… వన్ సెకన్.. ఇక్కడో ట్విస్ట్ ఉంది. మద్యంపై పన్ను రద్దు భారత్ లో కాదు.. దుబాయిలో. పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాలపై ఇప్పటిదాకా విధిస్తున్న 30 శాతం పన్నును పూర్తిగా రద్దు చేసింది. ఇది ఆదివారం నుంచే అమల్లో వచ్చింది. అంతేకాకుండా వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్‌లకు ఇకపై ఎలాంటి చార్జీ వసూలు చేయబోరు.
Read Also: BJP : 16నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. జేపీ నడ్డా పదవీకాలం పొడిగించే ఛాన్స్
దుబాయ్, అబుదాబి లాంటి గల్ఫ్ దేశాలకు పర్యాటకులు కోకొల్లలుగా వస్తుంటారు. చమురుతో పాటు పర్యాటక రంగంతోనే ఆ దేశాలకు భారీ ఆదాయం సమకూరుతోంది. అయితే, ఎన్నో సౌకర్యాలు ఉండే అరబ్ దేశాలకు టూరిస్టులు క్యూ కడుతున్నా.. అక్కడి కఠినమైన చట్టాలు, ఇస్లామిక్ నిబంధనల వల్ల వారికి కొంత అసౌకర్యం ఏర్పడుతోంది. దీన్ని గ్రహించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రమంగా నిబంధనలు సడలిస్తూ వస్తోంది. దీనికితోడు ఆర్థికాభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు మద్యం విక్రయాలపై నిబంధనలు సడలించింది. మద్యంపై విధిస్తున్న 30 శాతం పన్ను కూడా ఎత్తేసింది.
Read Also: Noida: ఢిల్లీ తరహాలో మరో ఘటన.. స్టూడెంట్లపైకి దూసుకొచ్చిన కారు
గతంలో అరబ్ దేశాల్లో ఇంట్లో మద్యం సేవించాలన్నా కొంత డబ్బు చెల్లించి వ్యక్తిగత లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మద్యం విషయంలో చట్టాలను సవరిస్తూ జనవరి 1న దుబాయ్ రాజ కుటుంబం ఈ ప్రకటన చేసింది. విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు మద్యంపై ట్యాక్స్ తగ్గించింది. దుబాయ్ చట్టాల ప్రకారం.. ముస్లింలు మద్యం తాగడానికి వీల్లేదు. ఇతరులు మద్యం సేవించాలంటే వీసా కలిగి, 21 ఏళ్లు దాటిన వారై ఉండాలి. కానీ, ఇప్పుడు ఈ చట్టాలను సవరించడంతో పాటు మద్యం ధరలు కూడా తగ్గించింది. దాంతో, విదేశీ పర్యాటకులకు ఊరట కలుగుతుందని గల్ఫ్ దేశం భావిస్తోంది. దుబాయ్‌లో ఎవరైనా ఇళ్లలో మద్యం సేవించాలంటే వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్ ఉండాల్సిందే. పన్ను రద్దు అనేది తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.