Chiyaan Vikram: వైవిధ్యమైన పాత్రలతో స్టార్ హీరోగా మారారు విక్రమ్. ఆయన సినిమా వస్తుందంటే అందులో ఏదో కొత్తదనం ఉందని భావిస్తుంటారు ఆయన అభిమానులు. రకరకాల గెటప్స్ వేస్తూ.. పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించే వారిలో విక్రమ్ ఒకరు. అంతకష్టపడుతారు కాబట్టే ఆయనకు ఇండస్ట్రీ దాసోహం అంటుంది. తమిళనాట అభిమానులు ముద్దుగా చియాన్ అంటారు. ఆయన సినిమాకోసం అభిమానులు తహతహలాడుతుంటారు. అలాంటి నటుడికి మరో అరుదైన గౌరవం లభించింది. దుబాయ్ ప్రభుత్వం అందిందచే గోల్డెన్ వీసా లభించింది. దీని ద్వారా ఆ దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవచ్చు. 2019 నుండి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలు అందజేయడం ప్రారంభించింది. యూఏఈ గవర్నమెంట్ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాకు దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు కాల పరిమితి ఉంటుంది.
Read Also: Sean Penn: ఆస్కార్ అవార్డును గిఫ్ట్గా ఇచ్చేసిన హాలీవుడ్ స్టార్
సినీ, సాహిత్యం, విద్య, కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పలువురు బాలీవుడ్ హీరోలు గోల్డెన్ వీసా అందుకున్నారు. ఇటీవల కమల్ హాసన్ కి యూఏఈ గవర్నమెంట్ గోల్డెన్ వీసా అందజేసింది. అయితే విక్రమ్ కి గోల్డెన్ వీసా అందజేయడంలో నటి పూర్ణ ఆమె భర్త ఇద్దరు కలిసి ఇవ్వడం జరిగింది. అయితే విక్రమ్ కి గోల్డెన్ వీసా ఇవ్వడంలో పూర్ణ దంపతులు ఎందుకు ఇచ్చారు అనే దానిపై రకరకాల ప్రశ్నలు నెట్టింట్లో వెలువడుతున్నాయి. ఇక దీని వెనక అసలు విషయం ఏమిటంటే.. నటి పూర్ణ భర్త షానిద్ అసిఫ్ అలీ. యూఏఈలో అతిపెద్ద వ్యాపారస్తుల్లో ఒకరు. ప్రస్తుతం అక్కడ ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే షానీద్ తన కంపెనీ ద్వారా హీరో విక్రమ్ కి గోల్డెన్ వీసా వచ్చే విధంగా చొరవ తీసుకోవడం వల్లనే ఇది సులభం అయ్యిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం పా రంజీత్ దర్శకత్వంలో ఓ పిరియాడికల్ చిత్రంలో నటిస్తున్నాడు హీరో విక్రమ్. మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు.
Read Also: Rashmika Serious On Trollers: ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ రష్మిక