Most millionaires in these cities: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సంపన్నులు ఎక్కువగా నగరాల్లోనే నివసిస్తున్నారు. ఎక్కువ మంది మిలియనీర్లు ఉంటున్న టాప్ -10 నగరాల్లో సగం అమెరికాలోనే ఉన్నాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్ పార్ట్‌నర్స్ గ్రూప్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం న్యూయార్క్, టోక్యో, శాన్ ప్రాన్సిస్కో బే ఏరియాల్లో అత్యధిక మంది మిలియనీర్లు నివసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
Read Also: Hyderabad Tops India: ఇండియాలో టాప్‌లో నిలిచిన హైదరాబాద్. అది కూడా గ్రేడ్-ఎ కేటగిరీలో..
ఈ డేటాను పరిశీలిస్తే అమెరికాలో అతిపెద్ద నగరం అయిన న్యూయార్క్ నుంచి 2022 ప్రథమార్థంలో 12 శాతం అధిక నికర విలువ కలిగిన మిలియనీర్లను కోల్పోయిందని.. శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంత 4 శాతం మిలియనీర్ల పెరుగుదలను నమోదు చేసినట్లు వెల్లడించింది. నాల్గవ స్థానంలో యూకే రాజధాని లండన్ ఉంది. లండన్ నగరంలో మిలియనీర్ల సంఖ్య 9 శాతం క్షీణించిందని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 1 మిలియన్ డాలర్ల పెట్టుబడి అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టగల ఆస్తులు ఉన్నవారిని మిలియనీర్లుగా పరిగణిస్తోంది.
ఇంటెలిజెన్స్ సంస్థ న్యూ వరల్డ్ వెల్త్ సేకరించిన గణాంకాల ప్రకారం.. సౌదీ అరేబియా రాజధాని రియాద్, యూఏఈలో మూడో అతిపెద్ద నగరం అయిన షార్జా నగరాల్లో ఈ ఏడాది మిలియనీర్ల సంఖ్యలో వేగంగా వృద్ధిని నమోదు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ) తక్కువ పన్ను విధానం, ఆల్ట్రా రిచ్ లైఫ్ అత్యంత సంపన్నులను ఆకర్షిస్తోంది. అబుదాబి, దుబాయ్ నగరాల్లో కూడా మిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. రష్యాలో ఎక్కువగా సంపన్నులు యూఏఈకి వలస వెళ్తున్నారు. సంపన్న నగరాల జాబితాలో తొమ్మిది, పదో స్థానాల్లో చైనా నగరాలు నిలిచాయి. చైనా క్యాపిటల్ బీజింగ్, ఎకనామికల్ క్యాపిటల్ షాంఘైలు రెండు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.