TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వేలలో భక్తులు తరలివస్తుంటారు.. అయితే, తిరుమలలో శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొంది. శ్రీవాణి దాతలకు ఏ రోజుకారోజున ఉదయం 10.30 గంటలకు టికెట్ల విక్రయాలు చేస్తామని ఇటీవల ప్రకటించింది టీటీడీ.. దీంతో, ముందు రోజు రాత్రి నుంచే ఈ టికెట్ల కోసం భక్తులు క్యూ కట్టారు.. రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు అధికారులు వేకువజామున టికెట్లు విక్రయిస్తుండడంతో.. రాత్రి నుంచి భక్తులు క్యూకట్టడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. ఇది స్వల్ప తోపులాటకు కూడా దారి తీసింది.. టికెట్లు దొరక్కపోవడంతో కొందరు అన్నమయ్య భవనం ఎదుట ఆందోళనకు దిగిన పరిస్థితి..
Read Also: Film Federation President: మేం చర్చలకు సిద్ధం.. నిర్మాతలే నాన్చుతున్నారు! పెండింగ్‌లో 13 కోట్లు
అయితే, శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులు సౌకర్యార్థం టిటిడి అనేక దర్శన విధానాలు అమలు చేస్తోంది. అందులో శ్రీవాణి దర్శనం ఒక్కటి.2018లోనే శ్రీవాణి ట్రస్ట్ ని ప్రారంభించింది టిటిడి.శ్రీవారి ఆలయ నిర్మాణంపేరుతో ప్రారంభమైన ఈ ట్రస్ట్ కి భక్తుల నుంచి విరాళాల తాకిడి అధికంగానే ఉంది. మొదట ఈ ట్రస్ట్ కి 2018 జూలై 24వ తేదిన సూరా లితి 5 లక్షల రూపాయలు విరాళంగా అందించగా…అటు తరువాత ట్రస్ట్ కి 2019 అక్టోబర్ నుంచి విరాళాల తాకిడి పెరిగింది. శ్రీవాణి ట్రస్ట్ కి 10 వేల రూపాయలు విరాళంగా అందిస్తే….వారికి ఎలాంటి సిఫార్సు లేఖ లేకుండా…విఐపి బ్రేక్ దర్శన టిక్కెట్టు జారీ చేసేలా దర్శన విధానాన్ని ప్రకటించింది టిటిడి.అది కూడా ప్రోటోకాల్ తరహలో బ్రేక్ దర్శన సౌకర్యం కల్పిస్తామని టిటిడి ప్రకటించడంతో..శ్రీవాణి ట్రస్ట్ కి విరాళాల పరంపర ప్రారంభమైంది.అప్పటి వరకు కూడా టిటిడి నిర్వహిస్తున్న అనేక ట్రస్ట్ లకు విరాళాలు అందించే భక్తులకు టిటిడి దర్శన సౌలభ్యం కల్పిస్తూ వచ్చింది.
Read Also: Polavaram: పోలవరం కాఫర్ డ్యాం వద్ద కుంగిన మట్టి..
అప్పటికప్పుడు బ్రేక్ దర్శనాలు కోరుకునే భక్తులకు సులభతరంగా వుండడంతో శ్రీవాణి ట్రస్ట్ కి విరాళాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2019 అక్టోబర్ 24వ తేదిన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనాలు టిటిడి ప్రారంభించగా…మొదట్లో రోజుకి 100 నుంచి 300 టిక్కెట్లు విక్రయాలు జరిగేవి.దినితో శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు నుంచి అందే విరాళాలు నెలకు మూడు నుంచి ఐదు కోట్లు వరకు వుండగా…మొదటి ఏడాదికి విరాళాలు 26 కోట్లకు చేరుకున్నాయి. అంత వరకు బాగానే వున్నా….అటు తరువాత శ్రీవాణి ట్రస్ట్ కి భక్తుల స్పందన క్రమంగా పెరుగుతూ రావడంతో 2020లో 70 కోట్లు ఆదాయం వచ్చింది..2021 లో 176 కోట్లు….2022లో 382 కోట్లు…2023లో 400 కోట్లు..2024లో 400 కోట్లు విరాళాలు గా అందాయి.దీంతో 5 సంవత్సరాల కాలంలోనే శ్రీవాణి ట్రస్ట్ కి భక్తుల విరాళాలు 1500 కోట్లు దాటేసింది.40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన అన్నప్రసాద ట్రస్టు కి భక్తులు అందించిన విరాళాలు ఇప్పటివరకు 2200 కోట్లు అయితే….శ్రీవాణి విరాళాలు రెండేళ్లలో అన్నప్రసాద ట్రస్ట్ విరాళాలలను దాటేసింది.
Read Also: Polavaram: పోలవరం కాఫర్ డ్యాం వద్ద కుంగిన మట్టి..
శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు నుంచి స్పందన పెరిగే కొద్ది టీటీడీకి కష్టాలు పెరుగుతున్నాయి.మొదట్లో శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే కేటాయించేది టీటీడీ.తిరుమల లోని అడిషనల్ ఈవో కార్యాలయంలోనే టికెట్ల కౌంటర్ ను ఏర్పాటు చేసింది టీటీడీ.విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి సిఫార్సు లేఖలు పై జారీ చేసే కార్యాలయం కూడా ఇదే కావడంతో …అలా టికెట్లు పొందలేని భక్తులు శ్రీవాణి టిక్కెట్లు పొందే వెసులుబాటు లభిస్తుందని భావిస్తున్నారు..దీనితో వారు దళారులను ఆశ్రయించాల్సిన అవకాశం ఉండదని టీడీపీ భావించింది.దీనితో శ్రీవారికి ఆదాయం లభించడంతోపాటు భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుందని టీటీడీ అధికారులు ఆలోచించారు. అందుకు అనుగుణంగానే శ్రీవాణి దర్శన టికెట్లకు భక్తుల నుంచి స్పందన కూడా క్రమేమి పెరుగుతూ వచ్చింది.దీనితో ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్లో కూడా టికెట్ల జారిని ప్రారంభించింది టీటీడీ. ఆన్లైన్లో రోజువారిగా 500 టికెట్లను జారీ చేయగా…ఆఫ్లైన్ విధానంలో ఎలాంటి నియంత్రణ లేకుండా టికెట్లు జారీ చేస్తూ వచ్చింది.ఇలా శ్రీవాణి టికెట్లు రోజువారీగా రెండు నుంచి మూడు వేల వరకు భక్తులు కొనుగోలు చేస్తూ ఉండడంతో వారికి కేటాయించే సమయం కూడా పెరుగుతూ వచ్చింది.