TTD Srivani Tickets: తిరుమలలో శ్రీవాణి టిక్కెట్ల జారీ విధానంలో మార్పులు చేర్పులు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆలోచిస్తోంది. ప్రస్తుతం రోజుకు 500 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో.. మరో 1,000 టిక్కెట్లను టీటీడీ ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తుంది. అయితే, భవిష్యత్తులో మొత్తం టిక్కెట్లను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జారీ చేసేలా ప్లాన్ చేస్తుంది. అయితే, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మూడు నెలల ముందుగానే భక్తులు టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది.
Read Also: TDP Key Meeting: నేడు టీడీపీ కీలక భేటీ.. పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
కానీ, ఆఫ్‌లైన్ టిక్కెట్లు మాత్రం ఏ రోజుకు ఆ రోజు మాత్రమే టీటీడీ జారీ చేస్తున్నారు. దీంతో ఆఫ్‌లైన్ కోటాకు ఎక్కువ డిమాండ్ ఏర్పడి, భక్తులు గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. కాబట్టి, ఈ సమస్యను అధిగమించేందుకు, ఆఫ్‌లైన్ కోటాను కూడా అదే రోజుకు ఆన్‌లైన్‌లో జారీ చేసే విధానాన్ని టీటీడీ పరిశీలిస్తోంది. ఈ విషయంపై భక్తుల అభిప్రాయాలను సేకరించి, తుది నిర్ణయం తీసుకోనుంది.