కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇదే అదునుగా భావించిన కొందరు దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. సోషియల్ మీడియా వేదికగా భక్తులను మోసగిస్తున్నారు దళారులు. శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కి చెందిన భక్తుడి వద్ద దర్శనాల పేరుతో రూ. 90 వేలు వసూలు చేసినట్లు గుర్తించారు. భక్తుడు దళారుపై టిటిడి విజిలెన్స్ కి పిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది. దళారులు శర్మ, నటరాజ్ లపై ఇప్పటికే 12 కేసులు నమోదైనట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. టిటిడి అధికారిక వెబ్ సైట్ ద్వారానే టిక్కెట్లు పొందాలని టిటిడి సూచిస్తోంది.