TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు మరో శుభవార్త చెప్పేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే శ్రీవాణి దర్శన టికెట్లు, వాటిపై దర్శనం విషయంలో కీలక మార్పులు చేసిన టీటీడీ.. ఇప్పుడు శ్రీవాణి దర్శన టిక్కెట్ల సంఖ్య పెంచే యోచనలో ఉంది.. ప్రస్తుతం జారి చేస్తున్న 1500 టిక్కెట్లను 2 వేలకు పెంచేందుకు వున్న అవకాశాలను పరిశీలిస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు.. ప్రస్తుతం నిత్యం ఆన్ లైన్ లో 500 టిక్కెట్లు.. ఆఫ్ లైన్ లో 1000 టిక్కెట్లు జారీ చేస్తూ వస్తుంది టీటీడీ.. అయితే, ఆఫ్‌లైన్‌లో ఉన్న డిమాండ్ దృష్ట్యా.. ఆఫ్ లైన్ లో మరో 500 టిక్కెట్లు పెంపునకు వున్న అవకాశాలను పరిశీలిస్తుంది టీటీడీ.. ఆఫ్ లైన్ లో 500 టిక్కెట్లు పెంచితే. రేణిగుంట విమానాశ్రయం కోటాను 200 నుంచి 400 పెంచాలని భావిస్తున్నారట.. ఇక, ఆ తర్వాత తిరుమల కోటా 800 నుంచి 1100 పెరిగే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారట.. అయితే, దీనిపై టీటీడీ కసరత్తు పూర్తి చేసిన తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది..
Read Also: Aishwarya Rai: తల్లిగా ఆ విషయంలో ఆందోళన చెందుతున్న ఐశ్వర్యా రాయ్..