TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తలకు అలర్ట్.. శ్రీవాణి దర్శన సమయాల్లో మార్పులు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తోంది. ఈ ప్రయోగం రేపటి నుంచి అమలుకానుంది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనుంది. ఆన్‌లైన్‌లో అక్టోబర్ నెల టిక్కెట్లు పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతించనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు పొందిన భక్తులను నవంబర్ నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలో తిరుమలలో 800 టిక్కెట్లు, రేణిగుంట ఎయిర్‌పోర్టులో 200 టిక్కెట్లు జారీ చేయనుంది టీటీడీ. ఇకపై ఏ రోజుకు ఆ రోజు దర్శన టిక్కెట్లు జారీ చేయనున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఉదయం 7 గంటల నుండి, తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి టిక్కెట్లు ఇస్తారు.
Read Also: YS Jagan Nellore Tour: నేడు నెల్లూరుకు వైఎస్ జగన్.. ఆంక్షలు, కండిషన్లతో ఉత్కంఠ..