సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ స్థానికాలయాల్లో వివిధ విశేష ఉత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబరు 7న గోకులాష్టమి సందర్బంగా ఎస్వీ గోశాలలో గోపూజ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 9న తిరుపతి శ్రీ కోదండరామాలయంలో శిక్యోత్సవం(ఉట్లోత్సవం) జరగనుంది. సెప్టెంబరు 10న శ్రీ గోవిందరాజస్వామివారి చిన్నవీధి శిక్యోత్సవం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 11న శ్రీ గోవిందరాజస్వామివారి పెద్దవీధి శిక్యోత్సవం, సెప్టెంబరు 18న వినాయక చవితి రోజున శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబరు 24 నుండి 27వ…
సెప్టెంబరు 18వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పటికే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు.
TTD Operation Cheetah successfully completed: తిరుమల శేషాచలం కొండల్లో ‘ఆపరేషన్ చిరుత’ విజయవంతంగా ముగిసింది. గత వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత.. ఎట్టకేలకు ఆదివారం (ఆగష్టు 27) రాత్రి బోనులో చిక్కింది. దాంతో అలిపిరి కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించినట్లు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ (సీసీఎఫ్‌వో) తెలిపారు. చిరుత రక్త నమూనాలు సేకరించి.. డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గత కొన్నిరోజులుగా…