Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే వైకుంఠ ద్వార దర్శనాలు ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు 10 రోజుల పాటు కొనసాగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది.
సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం ఈ సారి పెద్ద ఎత్తున మార్పులు చేపట్టినట్టు TTD అధికారులు తెలిపారు. మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) పూర్తిగా సర్వదర్శన భక్తులకే కేటాయించారు. ఈ మూడు రోజుల్లో మొత్తం 1.88 లక్షల టోకెన్లు DIP (Divya Darshan Incentive Programme) ద్వారా ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నారు.
రిజిస్ట్రేషన్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనుండగా, టోకెన్లు డిసెంబర్ 2 నుంచి అందుబాటులో ఉంటాయి. మిగతా ఏడు రోజులు (జనవరి 2 నుంచి 8 వరకు) రోజుకు 15,000 సర్వదర్శన టోకెన్లతో పాటు 1,000 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టోకెన్లు జారీ అవుతాయి. మొత్తం 10 రోజుల్లో సుమారు 8 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుందని అంచనా.
సర్వదర్శన భక్తులకు మరింత సమయం కేటాయించేందుకు VIP బ్రేక్ దర్శనాలను గణనీయంగా తగ్గించినట్టు TTD వెల్లడించింది. మొత్తం 184 గంటల వైకుంఠ ద్వార దర్శన సమయంలో 164 గంటలు సర్వదర్శన భక్తులకే కేటాయించారు. మొదటి రోజు 20 గంటల దర్శనం ఉండగా అందులో VIP బ్రేక్ కేవలం 4గంటల 45 నిమిషాలకు పరిమితం చేయగా, మిగతా రోజుల్లో గరిష్ఠంగా 2 గంటలకు మాత్రమే VIP బ్రేక్‌లు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి (జనవరి 8), వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఆధారంగా క్యూ లైన్లు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. భక్తులు అధికారిక TTD వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా టోకెన్లు బుక్ చేసుకోవాలని TTD కోరింది.
Bandi Sanjay : రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతుంది