Shiva Jyothi : సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుపతి ప్రసాదం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, నెగిటివ్ ట్రోలింగ్ ఎదురు కావడంతో… శివజ్యోతి ఇప్పుడు క్షమాపణలు కోరుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
ఇటీవల తిరుపతి ప్రసాదం, స్వామి దర్శనానికి సంబంధించి ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆమె వ్యాఖ్యలపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో శివజ్యోతి తాజాగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు కోరారు.
ఆమె మాట్లాడుతూ… “పొద్దున్నుంచీ తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ముందు హర్ట్ అయిన ప్రతి ఒక్కరికీ సారీ చెప్తున్నాను” అన్నారు. ఆ మాటల వెనుక ‘మేము రిచ్’ అని అన్నది… రూ.10,000 ఎల్1 క్యూ లైన్‌లో నిలబడ్డప్పుడు ఉద్దేశపూర్వకంగా అన్నది కాదని, కాస్ట్‌లీ లైన్‌లో నిలబడ్డామనే ఉద్దేశంతో మాత్రమే అన్నానని క్లారిటీ ఇచ్చారు.
ఆమె రెగ్యులర్ ఫాలోవర్స్‌కి తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసని, తాను నాలుగు నెలల నుంచి శనివారాల వ్రతాలు చేస్తున్నానని తెలిపారు. ‘నాకు అత్యంత విలువైనది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. ఆయన గురించి నేను తప్పుగా ఎట్లా మాట్లాడతా?’ అంటూ ఎమోషనల్ అయ్యారు.
నా ఇంటెన్షన్ అది కాదు, కానీ నా మాటలు తప్పుగా ఉన్న మాట వాస్తవం అని శివజ్యోతి ఒప్పుకున్నారు. కేవలం యూట్యూబ్ ఛానెల్స్, కేసులు పెడతారనే భయంతో కాకుండా… నాక్కూడా అనిపించింది, అట్లా మాట్లాడి ఉండకూడదని అందుకోసమే సారీ చెప్తున్నానని ఆమె స్పష్టం చేశారు. మళ్లీ ఎప్పుడూ ఇలాంటి రిపీట్ చేయనని ప్రామిస్ చేశారు. శివజ్యోతి ఇచ్చిన ఈ క్షమాపణలతో ఈ కాంట్రవర్సీ ఇప్పుడు ముగిసినట్టే కనిపిస్తోంది.