TTD Darshan Tickets: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్.. ఇప్పటికే మార్చి నెల వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడం.. అవి పూర్తిస్థాయిలో భక్తులు బుక్ చేసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు.. దర్శనాలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయబోతున్నారు.. ఇవాళ ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టిక్కెట్లు పెట్టబోతున్నారు.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేస్తారు.. మరోవైపు రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ..
Read Also: Rashmika Mandanna: రిటైర్‌మెంట్ తీసుకుందాం అనుకుంటున్న.. రష్మిక కామెంట్స్ వైరల్ !
ఇక, తిరుమలలో వైకుంఠద్వారా దర్శనాలు ముగిసిన తర్వాత భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.. ప్రస్తుతం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. దీంతో.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. నిన్న శ్రీవారిని 62,223 మంది భక్తులు దర్శించుకున్నారు.. 19,704 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.1 కోట్లుగా ప్రకటించింది టీటీడీ..