ఎల్లుండి తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు.. మలయప్పస్వామి ఒకే రోజు సప్త వాహనాలుపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ ఉంటుంది. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనసేవ, ఉదయం 11 గంటలకు గరుడవాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగియనున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మలయప్పస్వామి స్వామిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూస్తున్నారు.
READ MORE: Congo : కాంగో సైన్యం, తిరుగుబాటుదారుల మధ్య యుద్ధం.. పోరాటంలో 773 మంది మృతి
తిరుమల స్థానిక దర్శన టోకెట్ల జారీలో మార్పులు చేశారు. 4వ తేదీ రథసప్తమి కారణంగా ఫిబ్రవరి నెలలో రెండో మంగళవారం స్థానికులు దర్శనం కల్పిస్తున్నారు.
4వ తేదీకి బదులుగా 11వ తేదీన స్థానిక దర్శనం కల్పించనున్నారు. 9వ తేదీన స్థానిక దర్శనం భక్తులకు టోకెన్లు జారీ చేయనున్నారు. ప్రస్తుతం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 80871 మంది భక్తులు దర్శించుకున్నారు. 24257 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.78 కోట్లని అధికారులు తెలిపారు. మరోవైపు రేపు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టీటీడీ.
ఎల్లుండి శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది.
READ MORE: Komatireddy Venkat Reddy : ఒకే రోజు 118 మంది ఏఈఈ లకు డీఈఈ లుగా ప్రమోషన్