Revanth reddy: అందరూ హనుమాన్ చాలీసా చదవాలిసిందే అని, లక్ష్మణ్.. కిషన్ రెడ్డి వస్తే కలిసి చదువు కుందామని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేవారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ మీకోసం వస్తున్నారని, వరంగల్ రైతు డిక్లరేషన్ మాదిరిగానే యువత కోసం హైదరాబాద్ డిక్లరేషన్ అన్నారు.
TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ల అధికారులు మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసిన కేసులో మరో ఇద్దరిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో రాజకీయ వేడి రాజేస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఈ కేసును సిట్ నుంచి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పాటు పలువురు వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది.
ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో టీఎస్‌పీఎస్సీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్,రాజశేఖర్ రెడ్డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల బృందం రెండోరోజు చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ప్రశ్నించనుంది.
Pocharam Srinivas Reddy : జిల్లెల్ల వ్యవసాయ కళాశాల(Jillella Agriculture College) దేశంలోనే అత్యుత్తమ కళాశాల అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla)లో ఆయన పర్యటించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులకు ఈడీ లేఖ రాసింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ పేరుతో సిట్ అధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ కేస్ కు సంబంధించి 8 అంశాల డాక్యుమెంట్స్ తమకు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసు విచారణ వాయిదా పడింది. ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24వ తారీఖున విచారణ చేస్తామని తెలిపింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి తమ వాంగ్మూలాలను నమోదు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.