TSPSC: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్,రాజశేఖర్ రెడ్డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల బృందం రెండోరోజు చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ప్రశ్నించనుంది. నిన్న ప్రవీణ్ కుమార్,రాజశేఖర్ రెడ్డిలను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రవీణ్రాజశేఖర్ పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వారిని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి నాంపల్లి కోర్టు ఆదేశించింది. జైలు సూపర్ డెంట్ కు ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలనీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. నలుగురు ఈడీ బృందం వెళ్లి విచారించడానికి అనుమతించింది.
Read also: TSRTC: కూల్ కూల్‌గా ప్రయాణం.. ఆర్టీసీలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
TSPSC పేపర్ లీక్ ఇష్యూలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఏజెన్సీ అనుమానిస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ వేర్వేరు అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షల ప్రశ్నపత్రాలను వారికి అందించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. నిన్న(సోమవారం) ఈడీ బృందం ఉదయం 11 గంటలకు చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు చేరుకుని జైలు ఆవరణలోనే ప్రధాన నిందితులైన ఇద్దరినీ సాయంత్రం 5 గంటల వరకు విచారించింది. నేడు (మంగళవారం) కూడా విచారణ కొనసాగనుంది. ఇద్దరు నిందితులు నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాలు, వారు జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇతర వివరాలపై ఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. వీరిద్దరూ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల వివరాలను కూడా ఈడీ సేకరించింది.ఈ కేసులో హైదరాబాద్ సిట్ 17 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
Ramappa temple: రామప్ప దేవాలయ వారసత్వ ఉత్సవాలు.. రానున్న సినీ తారలు, కళాకారులు