తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసు విచారణ వాయిదా పడింది. మంగళవారం పేపర్ లీక్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకి అప్పగించాలని వేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ దన్క వాదనలు వినిపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే ఇద్దరు మాత్రమే నిందితులు అని ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఎలా చెబుతారని పిటిషన్ లో పేర్కొన్నారు.
Read Also : Russia-Ukraine War: గుట్టుచప్పుడు కాకుండా రష్యాకు ఈజిప్టు ఆయుధాలు..
పేపర్ లీకేజీపై అనుమానాలు ఉన్నాయని వాదించారు. సీబీఐ ద్వారా విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకి వస్తాయని వివేక్ దన్క వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది నిందితుల్లో 17 మందిని అరెస్ట్ చేశామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. మరో నిందితుడు ప్రశాంత్ న్యూజిలాండ్ లో ఉన్నాడని త్వరలో విచారణ చేస్తామని చెప్పారు. నిందితులను చట్ట ప్రకారం అరెస్ట్ చేసి జైలుకు పంపించామని ఏజీ చెప్పారు. ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24వ తారీఖున విచారణ చేస్తామని తెలిపింది.
Read Also : Ssc Paper Leak : టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురికి బెయిల్ మంజూరు
అయితే పేపర్ లీకేజీ ద్వారా ఐదుగురు గ్రూప్ -, ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్, ఇద్దరు డీఏవో పరీక్షలు రాసినట్లు గుర్తించామని సిట్ అధికారులు తమ స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికే 17 మంది నిందితులు ఇచ్చిన వివరాలతో అనుమానితులందరినీ విచారిస్తున్నామని.. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని తమ రిపోర్టులో హైకోర్టుకు ఇచ్చిన సిట్ వివరించినట్లు తెలుస్తోంది.