TSPSC Paper Leak Case: రాష్ట్రంలో రాజకీయ వేడి రాజేస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఈ కేసును సిట్ నుంచి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పాటు పలువురు వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఉన్నత న్యాయస్థానానికి గతంలో సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించిన ప్రభుత్వం ఇవాళ కౌంటర్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
Read Also: African cheetah dies : కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి
టీఎస్‌పీఎస్సీ రెండు రోజుల క్రితం కౌంటరు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రశ్న పత్రాల లీకేజీ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో టీఎస్‌పీఎస్సీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అదనపు కార్యదర్శి సుమతి పేరుతో అఫిడవిట్ దాఖలైంది. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తరఫున అదనపు కార్యదర్శి అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సిట్ తన నివేదికను షీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించింది. ఇదిలా ఉండగా.. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోకి ప్రవేశించి పేపర్స్ దొంగలించిన కేసులో బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. పేపర్ లీకేజీతో చాలా పరీక్షలు రద్దు చేసినట్టు టీఎస్‌పీఎస్సీ కోర్టుకు తెలిపిం ది.ఈ కేసుకు సంబంధిం చి టీఎస్‌పీఎస్సీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఆ తర్వాత కేసు సిట్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న కారణంగా ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని టీఎస్‌పీఎస్సీ అఫిడవిట్‌లో కోరింది.