Revanth reddy: అందరూ హనుమాన్ చాలీసా చదవాలిసిందే అని, లక్ష్మణ్.. కిషన్ రెడ్డి వస్తే కలిసి చదువు కుందామని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేవారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ మీకోసం వస్తున్నారని, వరంగల్ రైతు డిక్లరేషన్ మాదిరిగానే యువత కోసం హైదరాబాద్ డిక్లరేషన్ అన్నారు. ప్రియాంక గాంధీ సభ యువ సంఘర్షణ సభగా పేరు పెట్టామని తెలిపారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటన చేసిందని వెళ్లడించారు. మే 8న మధ్యాన్నం 3 నుండి 5 గంటల మధ్య సభ ఉంటుందని తెలిపారు. సాయంత్రం స్టేడియం వెళ్తున్నామన్నారు. థాక్రే కూడా వస్తారని తెలిపారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఎంఐఎం మీద పోటీ చేయకుండా ఉన్నది కిషన్ రెడ్డి.. లక్ష్మణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో.. ఉన్నది వాళ్ళు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. హనుమాన్ చాలీసా చదువుదాం అంటే రండి మా మెట్ల దగ్గర కూర్చొని అందరం కలిసి చదువుదామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమం అంతా నీళ్లు.. నిధులు.. నియామకాలు పేరుతో చేశారు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చి 9 ఏండ్లు అయినా… ఉద్యోగాలు ఇవ్వలేదని తీవ్రంగా మండిపడ్డారు. బిశ్వాల్ కమిటీ 1,91.738 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పిందని, 80 వేళా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పారని గుర్తు చేశారు.Tspsc ప్రశ్న పత్రాలు .. అంగట్లో అమ్మకానికి పెట్టారంటూ మండిపడ్డారు. వ్యవసాయాన్ని పక్కకు పెట్టారని, పండించిన పంట కొనుగోలు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ… రైతుల మీద లేదని మండిపడ్డారు. శరద్ మర్కట్ అనే ఐటీ ఉద్యోగి బీఆర్‌ఎస్ లో చేరాడని, వార్తలు వచ్చాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యవసాయం బాగుందని చేరినట్టు మర్కట్ చెప్పారని, మర్కట్ కి.. నెలకి లక్ష యాభై వేల జీతం ఇస్తున్నట్టు జిఓ ఇచ్చారని పేర్కొన్నారు.
Read also: Nora Fatehi: అబ్బబ్బా ఏం పోజులు నోరా.. ఇలా చూస్తే కుర్రాళ్లు ఆగుతారా
శరద్ మర్కట్ ని సీఎం పర్సనల్ సెక్రటరీగా నియమించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవడికి లక్ష యాభై వేల జీతం ఏంటి? ఐటి ఉద్యోగిగా 50 వేళా జీతం! అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ నిరుద్యోగులను విడిచిపెట్టి, మహారాష్ట్ర వాడికి లక్ష యాభై వేల జీతం ఇస్తావా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ తెచ్చింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. ని ఫార్మ్ హౌస్ లో జీతంతో పెట్టుకో.. కానీ పరాయి రాష్ట్రంలో కిరాయి మనిషికి ఇక్కడి ప్రజల డబ్బులు ఇత్తవా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఐదు లక్షల జీతం వదిలి వచ్చాడు మర్కట్ అన్నాడు. ఏడాదికి 18 లక్షలు ఇస్తున్నాడని ఎద్దేవ చేశారు. జోవో వెబ్ సైట్ లో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ లో ఉన్న 30 లక్షల నిరుద్యోగ యువత ఆలోచన చేయండి అని రేవంత్ పేర్కొన్నారు. పరాయి రాష్ట్రంలో పరపతి కోసం కిరాయి మనుషులను తెచ్చుకుంటున్నారు కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ ని తెలంగాణ సమాజం విశ్వసించడం మానేశారన్నారు. చాలా మంది మహారాష్ట్ర నుండి చేరుతున్నారని, ఎంత మందికి జీతం ఇస్తున్నారో తెలియదని తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర నుండి ఎందుకు.. కృష్ణానగర్ నుండి తెచ్చుకుంటే ఐపోయేది అంటూ ఎద్దేవ చేశారు. రైతులు అంటే రైతులు… ఏ వేషంలో రావాలంటే ఆ వేషంలో వస్తారు కదా? ఎద్దేవ చేశారు. మర్కట్ కి ఇచ్చే జీతం జీవో వెనక్కి తీసుకోవాలని, మహారాష్ట్ర లో ఇద్దరు ఎమ్మెల్యేలను ఏజెంట్ లుగా పెట్టారని ఆరోపణ చేశారు. ఇద్దరు నిజామాబాద్ దళారులు అక్కడ ఉన్నారని తెలిపారు. వాళ్లే పగటి వేశగాళ్లని, తెచ్చే టోళ్లకు వేషం మార్చి తెస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక లో జేడీఎస్.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు కేసీఆర్ దళారీగా పని చేస్తున్నారని అన్నారు. కేసీఆర్.. నిజంగానే బీజేపీ పై కొట్లాడితే.. కర్ణాటకలో బీజేపీని ఓడించండి అని కేసీఆర్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు? అని ప్రశ్నించారు. అక్కడే బీజేపీ.. బీఆర్ఎస్ మైత్రి బయట పడిందని అన్నారు.