టీఎస్పీఎస్సీ కేసులో కొత్త ముఠా దందా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ ఈ కేసులో 43 మంది నిందితులు అరెస్టయ్యారు. తాజాగా తెర పైకి వరంగల్ జిల్లాకి చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు రావడం కలకలం రేపుతోంది. సదరు విద్యుత్ శాఖ డీఈ కనుసున్నల్లో పెద్ద ఎత్తున ఏఈ పేపర్ చేతులు మారినట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే కేసులో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవి కిషోర్‌ను సిట్ అరెస్ట్ చేసింది. అతని వద్ద నుండి 20 మందికి ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లు సిట్ గుర్తించింది.
Sangareddy Case Mystery: తల్లితో ఎఫైర్.. కూతురిపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
వరంగల్ జిల్లాకు చెందిన డీఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఓ కోచింగ్ సెంటర్లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. అయితే.. అక్కడికి వచ్చిన అభ్యర్థులతో పరిచయం పెంచుకొని ఈ దందాకు తెర లేపినట్లు సిట్ అధికారులు గుర్తింపు. ఏఈ పరీక్షలో టాపర్.. కానీ ఏ ప్లస్ బీ స్వేర్ కూడా తెలియని అభ్యర్థులు ఉన్నట్లు సిట్ వెల్లడించింది.
పరీక్షలు రాసి ఉత్తీర్ణుల అయి టాప్ మార్కులు సాధించిన వారి మీద సిట్ అధికారులు నిఘా పెట్టారు. అడిగిన ప్రశ్నలకు కనీసం సమాధానాలు ఇవ్వకుండా దిక్కులు చూస్తున్న టాప్ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులను ఆరా తీస్తున్నారు.