తెలంగాణ వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం సంచలనం రేకెత్తించింది. ఈ వ్యవహారంతో కమిషన్ పలు పరీక్షలను రద్దు చేయగా.. మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో సిట్, ఈడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం 44 మందిపై కేసు నమోదు చేయగా.. 43 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తుంది. మొన్నటిదాకా ఇదంతా కేవలం క్వశ్చన్ పేపర్లు చేతులు మారిన వ్యవహారమని అధికారులు భావించిన.. తాజాగా.. టెక్నాలజీని వినియోగించి తెలంగాణ స్టేట్ పబ్లీక్ సర్వీస్ కమిషన్ లో చీటింగ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Also Read : Indian Armed Forces : యుద్ధానికి సిద్ధమవుతున్న భారత సైన్యం.. 100 మంది అధికారుల నియామకం
ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సిట్ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీఎస్‌పీఎస్సీ నోటీసులు జారీ చేసింది.
Also Read : Telangana Rains: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
మరో వైపు ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. లీకేజీకి పాల్పడిన వారు వ్యవస్థను మోసం చేయడానికి ChatGPTని ఉపయోగించినట్లు వెల్లడించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రశ్నపత్రాలను కాపీ చేసిన తర్వాత నిందితులలో ఒకరు సమాధానాలు పొందడానికి AI సాంకేతికతను ఉపయోగించినట్లు లీక్‌పై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కనుగొంది.