Group-1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఫలితాల అనంతరం రద్దు చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహించేందుకు టీఎస్ పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 36 మంది అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. గ్రూప్ 1ని రెండు నెలల పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు తమ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్లపై ఈనెల 25న హైకోర్టు విచారణ చేపట్టనుంది.
పేపర్ లీకేజీ కేసులో కొనసాగుతున్న విచారణ..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. ఓ వైపు నిందితులను విచారిస్తూనే.. క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను 5 గ్రూపులుగా ఏర్పాటు చేసిన అధికారులు ప్రశ్నించారు. ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అభ్యర్థులు విద్యార్హత, గ్రూప్-1 ప్రిలిమ్స్ మార్కులు, ఎక్కడ శిక్షణ పొందారు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వివరాలు సేకరిస్తారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితుడైన రాజశేఖర్ రెడ్డితో అభ్యర్థులకు స్నేహం, బంధుత్వం ఉందా అని కూడా ఆరా తీశారు. నగదు వ్యవహారం వెలుగులోకి రావడంతో పేపర్ లీకేజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది.
వాట్సాప్ ద్వారా ‘గ్రూప్-1’ ప్రిలిమినరీ పరీక్ష పేపర్లు చేతులు మారినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితులు ప్రశ్నపత్రాలను పకడ్బందీగా పంచుకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. కేసు ఈడీకి వెళ్లింది. టీఎస్‌పీఎస్‌సీ కమిషన్ కార్యాలయ కేంద్రంలోనే ఈ వ్యవహారమంతా కొనసాగినట్లు అంచనా. తాజాగా అరెస్టయిన అసిస్టెంట్ సెక్షన్ అధికారులు షమీమ్, నలగోపుల సురేష్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దామెర రమేష్ కుమార్ రిమాండ్ రిపోర్టులో అధికారులు రిమాండ్ రిపోర్టులో పలు అంశాలను ప్రస్తావించారు. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్ రెడ్డి న్యూజిలాండ్ లో ఉంటున్న తన బావమరిది ప్రశాంత్ రెడ్డికి పేపర్ ను వాట్సాప్ లో షేర్ చేశాడు. అతనికి నోటీసు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రధాన నిందితుల్లో ఒకరైన రేణుక బెయిల్ పొంది ఇప్పటికే జైలు నుంచి విడుదలైంది.
Vaibhavi Upadhyaya: కారు ప్రమాదంలో ప్రముఖ నటి మృతి