TSPSC : తెలంగాణ జూనియర్ లెక్చరర్ పరీక్షలో మెట్పల్లి మహిళకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో మెట్పల్లి పట్టణానికి చెందిన జనమంచి సాయిశిల్ప రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించింది. ఇంగ్లీష్ సబ్జెక్టులో 450 మార్కులకు గాను 325.657 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. గతంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన సాయిశిల్ప తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (గురుకులం పాఠశాలలు) నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌లో స్టేట్ సెకండ్ ర్యాంక్ కూడా సాధించింది.
ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాఠశాలలో ప్రాథమిక ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు సిద్ధమైంది. మెట్‌పల్లిలోని కళానగర్‌కు చెందిన ఆమె మెట్పల్లి పట్టణంలో పాఠశాల విద్యను పూర్తి చేసి 2012-14లో కోరుట్లలో టీటీసీ చదివింది. 2017-19 విద్యా సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసిన సాయిశిల్ప టీఎస్‌సెట్, నెట్, జేఆర్ఎఫ్లకు కూడా అర్హత సాధించింది. సాయిశిల్ప తెలంగాణ టుడేతో మాట్లాడుతూ.. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను ర్యాంక్ సాధించగలిగానని అన్నారు. ఓయూలో పీహెచ్డీ చేస్తున్న ఆమెకు ప్రొఫెసర్ కావాలనుకున్నారు.
Also Read
- Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
- PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
- Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
- Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
తాజావార్తలు
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!