గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్‌సీ అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించింది. 783 పోస్ట్ ల భర్తీకి 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్షకు 5 లక్షల 51 వేల 855 మంది దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు వాయిదా పడి గత డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష జరిగింది. 2 లక్షల 51 వేల 738 (45.57 శాతం) మంది పరీక్ష రాశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
READ MORE: Ranya Rao: పెళ్లైన రెండు నెలల నుంచే.. భర్త ఫిర్యాదుతో అడ్డంగా బుక్కైన నటి
ఇదిలా ఉండగా.. సోమవారం గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా మొత్తం 563 ఖాళీలను భర్తీ చేశారు. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను అధిగమించిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే 1,363 గ్రూప్-3 పోస్టులకు భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. కాగా.. మార్చి 14వ తేదీన గ్రూప్-3 ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది.
READ MORE: Medak District: ఉమ్మడి మెదక్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో కోళ్ల మృత్యువాత