Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ బూటకపు విచారణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోణాన్ని తప్పుగా మలుపు తిప్పుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నప్పటికీ వారిని మాత్రం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యాంశం.. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ నేతల ఫోన్‌లు ట్యాప్ చేయించారన్నది. “కేసీఆర్ అనే మూర్ఖుడు రాజకీయ నాయకుల ఫోన్‌లను ట్యాప్ చేయించాడు. ఆయన తన కుమారుడితో కలిసి ప్రత్యేక ఇన్టెలిజెన్స్ బ్రాంచ్ (SIB) ను వ్యక్తిగత అవసరాల కోసం దుర్వినియోగం చేశారు,” అంటూ సంజయ్ ఆరోపించారు.
Marco Rubio: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది ట్రంపే.. శాంతి అధ్యక్షుడిగా మార్కో రూబియో బిరుదు
ఇంతటితో ఆగకుండా.. “TSPSC పేపర్ లీకేజీ విచారణ చేస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. రాధాకృష్ణ రావు, ప్రభాకర్ రావులను ఎంత క్షోభకు గురి చేశారో గుర్తుంచుకోవాలి” అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కేసీఆర్ కుటుంబానికి పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన చెప్పింది కేసీఆర్ చెప్పినట్లే ఉంది. ఇప్పుడు కమిషన్లు పెట్టడం, విచారణల పేరిట డ్రామాలు ఆడడం ఎందుకు?’’ అని ప్రశ్నించారు. వాస్తవమైన విచారణ కావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ‘‘మీ విచారణలపై నాకెలాంటి నమ్మకమూ లేదు. ఈ కేసును తక్షణమే సీబీఐకి ఇవ్వండి. కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా మాత్రమే నిజం వెలుగు చూస్తుంది,’’ అని డిమాండ్ చేశారు.
‘‘ఒక్క రాజకీయ నాయకుడినీ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. వందల కోట్ల కిక్బ్యాక్‌లు పట్టుబడ్డాయి, కానీ వాటి విచారణ లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఓ మంత్రి వద్ద 7 కోట్లు దొరికాయి. వాటిపై ఎలాంటి అడుగులు వేయడం లేదు. ఇదేంటి న్యాయం?’’ అని సంజయ్ ప్రశ్నించారు. డిల్లీలో BRS, కాంగ్రెస్ నేతల మధ్య ‘మూట్ల డీల్’లు జరుగుతున్నాయని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక్కో స్కాం వెనుక రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి. కేసీఆర్ కాంగ్రెస్ నేతలతో కలిసి వందల కోట్ల లావాదేవీలు చేస్తున్నాడు,’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gautam Gambhir: హమ్మయ్య.. గంభీర్ హామీ ఇచ్చాడు! ఇక అరంగేట్రం పక్కా