Group-1 Mains : ఈనెల 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు
- షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 మెయిన్స్
- ఈ నెల 14 నుండి TGPSC వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్
- ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్
- మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 అభ్యర్థులకు కీలకమైన సమాచారాన్ని అందించింది. 2024, అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు 2024, అక్టోబర్ 14 నుండి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, అభ్యర్థులు హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్‌లోడ్ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే, టోల్ ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించవచ్చని చెప్పారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగనున్నాయి.
Heroines: రూట్ మార్చిన హాట్ బ్యూటీస్… దెబ్బకు షేక్ చేస్తున్నారే!
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
అభ్యర్థులను మధ్యాహ్నం 12.30కి పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారు, కాగా మధ్యాహ్నం 1.30కు గేట్లు మూతబడతాయని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులకు సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబడినట్లు కూడా తెలియజేశారు. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫలితాలను విడుదల చేశారు.
గ్రూప్ 1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి, ప్రతి పేపర్ 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహించబడుతుంది. పరీక్షలు క్రింది షెడ్యూల్ ప్రకారం ఉంటాయి:
- జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ పేపర్): అక్టోబర్ 21
- పేపర్-I (జనరల్ ఎస్సే): అక్టోబర్ 22
- పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం): అక్టోబర్ 23
- పేపర్-III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్): అక్టోబర్ 24
- పేపర్-IV (ఎకానమీ, డెవలప్మెంట్): అక్టోబర్ 25
- పేపర్-V (సైన్స్ & సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్): అక్టోబర్ 26
- పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం): అక్టోబర్ 27
మెయిన్స్ పరీక్ష ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించబడుతుంది. జనరల్ ఇంగ్లీష్ తప్ప, మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషలో రాయాలి. గతంలో రెండు సార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దు కావడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు.
Minister Narayana: మద్యం టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. మంత్రి ఆగ్రహం
తాజావార్తలు
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!