దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. మన మార్కె్ట్కు నవంబర్ నెల అంతగా కలిసి రానున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఫలితాలకు ముందు అనిశ్చితి ఏర్పడడంతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఫలితాలు వచ్చాక అధ్యక్షుడెవరో ఒక క్లారిటీ వచ్చేసింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ఆదివారం డెలావేర్‌లోని ఇసుక బీచ్‌లో గడిపేందుకు వెళ్లారు. అయితే బైడెన్ ఇసుకలో నడిచేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. పలుమార్లు బైడెన్ తుళ్లిపడబోయారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా రెండో రోజు ఒడుదొడుకులు కొనసాగాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించిన తర్వాత.. మార్కెట్‌కు కొత్త ఊపు సంతరించుకుంటుందని ఆర్థిక నిపుణులు భావించారు.
అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో సంభాషించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించాలంటూ పుతిన్‌కు ట్రంప్ సూచించినట్లు వార్తలు వచ్చాయి.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. తొలుత సర్వేలన్నీ కమలా హారిస్ వైపే ఉన్నాయి. కానీ అసలైన ఫలితాలు వచ్చేటప్పటికీ సర్వేలన్నీ తలకిందులయ్యాయి.
అమెరికా అధ్యక్ష ఎన్ని్కలపై ఎట్టకేలకు పాకిస్తాన్ స్పందించింది. నవంబర్ 6న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ భారీ విజయంతో గెలుపొందారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్ని్కయ్యాక ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లకు మంచి జోష్ వచ్చింది. పసిడి, చమురు ధరలు దిగొస్తున్నాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్లలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన విజయం సాధించారు. 2016 నుంచి 2020 వరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన ట్రంప్.. అధ్యక్షుడిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్శించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో గ్రాండ్ విక్టరీని అందుకున్నారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ అల్లుడే కాబోతున్నారు. ఉపాధ్యక్షుడిగా జెడీ వాన్స్ ఎన్నిక కానున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ విజయంతో దేశీయ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. బుధవారం అగ్ర రాజ్యం ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా ట్రంప్ విజయం దిశగా దూసుకెళ్లారు.