ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ప్రధాన శత్రువు ట్రంపేనని.. ఆయనను చంపాలని టెహ్రాన్ కురుకుంటోందని తెలిపారు. ట్రంప్ సమస్యను పరిష్కరించగల సమర్థ నాయకుడు అని పేర్కొన్నారు. బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ట్రంప్ ఇష్టపడరన్నారు. ఇక ప్రత్యర్థికి లొంగిపోరన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదనే ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే ఇరాన్‌కు ట్రంప్ ప్రధాన శత్రువుగా మారారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ను చంపాలని టెహ్రాన్ భావిస్తున్నట్లుగా వెల్లడించింది. ప్రపంచ దేశాలకు ఇరాన్ పెనుముప్పుగా మారుతోందన్నారు. ముప్పును తొలగించేంత వరకు ఇజ్రాయెల్ పోరాడుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Love: ఇచ్చిన మాట కోసం.. ప్రియురాలి మృతదేహాన్ని వివాహం చేసుకున్న ప్రియుడు
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చూసింది. అణు స్థావరాలు బాగా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులు చేసింది. దీంతో సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌లో స్వల్ప భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 2.5గా నమోదైంది. ఇక 14 మంది అణు శాస్త్రవేత్తలు కూడా చనిపోయినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Samantha : ముందు కంటే ఇప్పుడే బాగున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..
ఇదిలా ఉంటే ఖతార్, ఒమన్ మధ్యవర్తులుగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు సిద్ధపడ్డాయి. కానీ ఇరాన్ అందుకు అంగీకరించలేదు. ఇజ్రాయెల్ ముందస్తు దాడులకు పాల్పడడంతో ఇరాన్ ఆగ్రహంగా ఉంది. ఇక ట్రంప్ కెనడా పర్యటనకు వెళ్లే ముందు ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రావాలని సూచించారు. అందుకు ఇరాన్ అంగీకరించలేదు.
4 రోజుల నుంచి జరుగుతున్న దాడుల్లో ఇరాన్‌లో మరణాల సంఖ్య పెరిగింది. 230 మంది చనిపోయారు. ఇందులు 90 శాతం మంది పౌరులేనని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇక ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 10 మంది చనిపోయారు. ఇందులో పిల్లలు అన్నారు.