అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయితే ట్రంప్ వలస వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ లాస్ ఏంజిల్‌లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అయితే బలగాలు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. ఇక ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. దీంతో నేషనల్ గార్డ్స్ మోహరించాలని ట్రంప్ ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున నేషనల్ గార్డస్, మెరైన్స్ మోహరించారు.
ఇది కూడా చదవండి: US: అమానుషం.. భారతీయ విద్యార్థికి బేడీలు.. వీడియో వైరల్
ప్రస్తుతం లాస్ ఏంజిల్‌లో దాదాపు 700 మంది మెరైన్‌లు మోహరించారు. ఇదిలా ఉంటే నాల్గో రోజు కూడా వందలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి వలస విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ దగ్గర జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు ఫ్లాష్ బ్యాంగ్స్ మరియు రబ్బరు బుల్లెట్లను ఉపయోగించారు. ఇక ఈ ప్రాంతాలను ఖాళీ చేయాలని పోలీసులు లౌడ్ స్పీకర్లలో అనౌన్సెమెంట్ కూడా చేస్తున్నారు. ఇక నిరసనకారులు వెళ్లకపోవడంతో రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు.
ఇది కూడా చదవండి: Vijayawada: ఇంద్రకిలాద్రి అమ్మవారి ఆలయంలో అంతర్గత బదిలీలు.. 40 మంది అర్చకులతో పాటు పలువురు బదిలీలు..!
హింసాత్మక చర్యలకు పాల్పడే వారిని అడ్డుకొనేందుకు, అల్లర్లను ఎదుర్కొనేందుకు లాస్ ఏంజిల్‌లో నేషనల్ గార్డులు మోహరించారని ట్రంప్ ఒక పోస్టులో స్పష్టం చేశారు. ఇలా చేసి ఉండకపోతే లాస్ ఏంజిల్ తుడిచిపెట్టుకుపోయేదని అభిప్రాయపడ్డారు. లాస్ ఏంజిల్ మేయర్ కృతజ్ఞతలు చెప్పాల్సింది పోగా.. ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ట్రంప్ విమర్శించారు.
🇺🇸 Los Angeles riots This is Highway 101. The main thoroughfare in Los Angeles appears pic.twitter.com/fOWcSmnRui
— HB Li (@HBLi17) June 10, 2025
Marines with 2nd Battalion, 7th Marines, who were placed in an alert status over the weekend to support #USNORTHCOM mission, prepare to depart for the greater Los Angeles area June 9. pic.twitter.com/xUDw0byvqd
— U.S. Northern Command (@USNorthernCmd) June 9, 2025