దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కారణంగా సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.
ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో మోడీ పర్యటించనున్నారు. ఇక 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఫ్రాన్స్‌లో ఏఐ సమ్మిట్ జరగనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల చేసిన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.
ప్రధాని మోడీ సోమవారం రెండు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఫ్రాన్స్, అమెరికాలో మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఏఐ సమ్మిట్‌కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు.
అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. 104 మంది భారతీయులు పంజాబ్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపుతున్న తీరుపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రయాణం అంతా చేతులకు, కాళ్లకు బేడీలు వేశారని, అమృత్సర్ విమానాశ్రయంలో దిగిన తర్వాతే తీసినట్లు బహిష్కరణకు గురైన వారు తెలిపారని రాజ్యసభలో ప్రస్తావించారు.
అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. ఈ అంశంపై మొదటిసారిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం దేశాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమ వలసదారులుగా ప్రకటించిన 104 మంది భారతీయులు బుధవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తిరిగి వచ్చారు. ఆ విమానం బుధవారం శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
Washington DC Plane Crash: వాషింగ్టన్ డీసీలో బుధవారం రాత్రి జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను ఢీకొట్టింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థాన్ ఉగ్రవాది పన్ను హాజరుకావడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కనిపించడంపై విదేశాంగ శాఖ స్పందించింది. ఈ విషయాన్ని అమెరికాతో భారత్ లేవనెత్తుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దేశ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికాతో భారత్ లేవనెత్తుతూనే ఉంటుందని ఆయన శుక్రవారం తెలిపారు.
జో బైడెన్.. అమెరికా మాజీ అధ్యక్షుడు. మూడు రోజుల క్రితమే మాజీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లు అగ్ర రాజ్యాన్ని పరిపాలించిన అధ్యక్షుడు. ఈ విషయం ప్రపంచమంతటికీ తెలుసు.