ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం సాగుతోంది. ఇరుపక్షాలు క్షిపణులు ప్రయోగించుకుంటున్నారు. దీంతో ఆస్తితో పాటు ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇరాన్-ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేసుకోవాలని.. ఇదే అనుకూల సమయం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి కెనడాకు వెళ్లే ముందు వైట్ హౌస్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఖతార్, ఒమన్ దేశాలు కూడా మధ్యవర్తులుగా ముందుకొచ్చి శాంతి చర్చలు జరుపుతామని పేర్కొన్నాయి. అందుకు ఇరాన్ నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Vijay Rupani: నేడు అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు
ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతుండడంతో ప్రపంచ అధినేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయేమోనని భయాందోళన చెందుతున్నారు. 4 రోజుల నుంచి జరుగుతున్న దాడుల్లో ఇరాన్‌లో మరణాల సంఖ్య పెరిగింది. 230 మంది చనిపోయారు. ఇందులు 90 శాతం మంది పౌరులేనని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇక ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 10 మంది చనిపోయారు. ఇందులో పిల్లలు అన్నారు.
ఇది కూడా చదవండి: Trump: నేను శాంతి కోసం చాలా చేస్తాను.. కానీ నాకు క్రెడిట్ దక్కదు
ఇజ్రాయెల్ ముందస్తు దాడులకు పాల్పడడంతో ఇరాన్ ఆగ్రహంగా ఉంది. ఖతార్, ఒమన్ మధ్యవర్తులుగా చర్చలు జరపడానికి ముందుకు రావడంతో అందుకు ఇరాన్ తోసిపుచ్చింది. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అగ్ర కమాండర్లతో పాటు అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని కూడా చంపేందుకు ప్రయత్నించగా అమెరికా అడ్డుపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మొహమ్మద్ కజెమి మరణించినట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్ మీడియా పేర్కొంది.