అగ్ర రాజ్యాధినేతలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌లను చంపేస్తామంటూ అల్‌ఖైదా అధిపతి సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లా హెచ్చరించాడు. గాజా యుద్ధానికి ప్రతీకారంగా ఆ ముగ్గురిని అమెరికా ముస్లింలు చంపేయాలని పిలుపునిచ్చాడు. గాజాలో పాలస్తీనా వాసులకు వీరు ఎటువంటి ఆధారం మిగల్చలేదని.. అందుకే ఈ స్థాయిలో దాడులు చేయాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు 34 నిమిషాల వీడియోలో పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Kangana : హనీమూన్‌లో భర్తని చంపిన భార్య కేస్ పై.. రియాక్ట్ అయిన కంగనా రనౌత్..
గాజా యుద్ధానికి ప్రతీకారంగా డోనాల్డ్ ట్రంప్, ఎలోన్ మస్క్, జేడీ వాన్స్‌లను హత్య చేయాలని అల్-ఖైదా చీఫ్ అమెరికన్ ముస్లింలకు పిలుపునిచ్చాడు. 2024, మార్చిలో సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లా అల్‌ఖైదా అధిపతిగా ఎన్నికయ్యాడు. అతడి తలపై అమెరికా 6 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: భర్త హత్యకు రూ.20లక్షల డీల్.. స్వయంగా డెడ్‌బాడీని లోయలోకి తీసేసిన సోనమ్!
అగ్ర నేతలతో పాటు వారి కుటుంబాలను కూడా చంపేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా వైట్‌హౌస్‌తో సంబంధాలు ఉన్న వారిని.. సన్నిహితంగా ఉన్న వారందరినీ హతమార్చుతామంటూ హెచ్చరించారు. గాజాలో జరుగుతున్న మారణహోమానికి ప్రతీకారంగా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించాడు.
అల్‌ఖైదాను ఒసామా బిన్ లాడెన్ స్థాపించాడు. 2009లో ఇది స్థాపించబడింది. యెమెన్‌లో ఉన్న ఒక ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ ఇది. జిహాద్ పేరుతో అల్‌ఖైదా మారణహోమం సృష్టిస్తోంది. అల్ ఖైదా ఉగ్రవాదులు చాలా ప్రమాదకరమైన వాళ్లు. గత కొంతకాలంగా అలఖైదా యెమెన్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అల్ ఖైదా పరిగణించబడింది. అమెరికా, దాని మిత్ర దేశాలను అల్ ఖైదా పదే పదే బెదిరిస్తూ ఉంటుంది. ఇక నిఘా వర్గాలు కూడా అల్ ఖైదా తీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటారు.