మే నెలలో జరిగిన సైనిక దాడులలో భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించిన విధంగానే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా శాంతి చర్చల ఒప్పందాన్ని కుదిర్చడానికి తాను ప్రయత్నిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఫోన్‌లో చాలా చర్చలు, సమావేశాలు జరుగుతున్నాయని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన తన మెసేజ్ లో పేర్కొన్నారు.
Also Read:Kamal hassan : ‘థగ్ లైఫ్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేశారా?
దాడులను ఆపడానికి ఇరాన్, ఇజ్రాయెల్ త్వరలో ఒక ఒప్పందానికి రావచ్చని ట్రంప్ అన్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పై ట్రంప్ దాడి చేస్తూ, తన పదవీకాలంలో తీసుకున్న అనేక మూర్ఖపు నిర్ణయాల వల్ల పరిస్థితి మరింత దిగజారిందని, దానిని తిరిగి గాడిలో పెట్టడానికి కూడా తాను ప్రయత్నిస్తున్నానని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య త్వరలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నానని తెలిపారు.
Also Read:Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసింగ్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్న కేటీఆర్
నేను శాంతి కోసం చాలా చేస్తానని ట్రంప్ అన్నారు. కానీ దానికి నాకు క్రెడిట్ దక్కదు. నేనే ఏం చేశాను అనేది అర్థం చేసుకునే వాళ్లు అర్ధం చేసుకుంటారని తెలిపారు. నేను మధ్యప్రాచ్యం (పశ్చిమ ఆసియా)ను మళ్ళీ గొప్పగా చేస్తాను. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ద్వైపాక్షిక ప్రాతిపదికన జరిగిందని భారత్ చెప్పిందని, ట్రంప్ ప్రమేయం ఉందనే వాదనను తిరస్కరించిందని ఆయన వెల్లడించారు.
Also Read:Seediri Appalaraju: మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్న..
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదాన్ని సులభంగా పరిష్కరించుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా అదే కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ చర్యపై ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇరాన్ పై దాడిలో అమెరికా ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కాబట్టి ఇరాన్ ఏ అమెరికన్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పు చేయకూడదు. ఇరాన్ అలా చేస్తే, అమెరికా దానికి ఊహించని గుణపాఠం నేర్పుతుంది అని హెచ్చరించారు.