పహల్గామ్ ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాశ్మీర్ సమస్య చాలా ఏళ్లుగా ఉందని.. ఆ సమస్యనే పాకిస్థాన్-భారత్ పరిష్కరించుకోవాలని సూచించారు.
అమెరికా రక్షణ కార్యదర్శి హీట్ హెగ్రేత్ రాజీనామా చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొత్త కార్యదర్శి కోసం వైట్‌హౌస్ వెతుకులాట ప్రారంభించిందని వార్తలు ప్రకారం అవుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఈస్టర్ సందర్భంగా కాల్పులకు విరామం ప్రకటించి సంచలనం సృష్టించారు. తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అన్ని దేశాల నుంచి, ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. దాదాపు 90 రోజుల పాటు సుంకాలను వాయిదా వేశారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వేదికగా పలుమార్లు రష్యా-అమెరికా అధికారుల మధ్య చర్చలు జరిగాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడి మరణంపై అనుచితంగా మాట్లాడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన గురించి మాట్లాడుతూ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణంపై ట్రంప్ అవహేళనగా మాట్లాడారు.
ఇటలీ ప్రధాని మెలోనీ గురువారం అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మెలోనీ సమావేశమై సుంకాలపై చర్చించారు. అన్ని దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు పెంచేశారు. దీంతో ప్రపంచ మార్కెట్లు ఘోరంగా దెబ్బ తిన్నాయి.
హార్వర్డ్ యూనివర్సిటీపై చర్యలకు ట్రంప్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. తాజాగా విశ్వవిద్యాలయానికి ఇస్తున్న పన్ను మినహాయింపును కూడా రద్దు చేయాలని రెవెన్యూ ఏజెన్సీకి ట్రంప్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే వలసదారుల్ని కట్టడి చేశారు. ఇక అక్రమంగా అమెరికాలో ఉంటున్న వలసదారులకు తాజాగా ట్రంప్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. సుంకాలను 90 రోజులు ట్రంప్ వాయిదా వేశారు. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో నూతనోత్సహాన్ని నింపింది. దీంతో అమెరికా మార్కెట్‌తో పాటు ఆసియా మార్కెట్లు భారీ లాభాలు అర్జిస్తున్నాయి.