ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలపై సమస్త అధికార యంత్రాంగానికి సీఎం దిశా నిర్ధేశం చేయనున్నారు. ఏపీ ఉప…
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ గతేడాది నుంచి యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. ప్రస్తుతం ఇంకా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. తాజాగా ఇదే వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌కు కీలక సూచన చేశారు.
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. 2019లో తాను ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో హూస్టల్‌లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ సభపై మాట్లాడారు. కమిడియన్స్ ఆండ్రూ షుల్ట్జ్, ఆకాష్ సింగ్‌తో కలిసి ‘‘ఫ్లాగ్రాంట్’’ పోడ్‌కాస్టులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ భేటీలో పీఎం మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ బయటకు శాంతంగా, తండ్రిలా కనిపిస్తారు కానీ, ఆయన కఠినంగా ఉండే మంచి వ్యక్తి అని అభివర్ణించారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కమలాహారిస్ దూసుకెళ్లిపోతున్నారు. తాజా సర్వేలో ఆమె ముందంజలో ఉన్నారు. డెమొక్రాట్ అభ్యర్థిగా కమలాహారిస్.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ బరిలో ఉన్నారు. నవంబర్లోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా జరిగిన సర్వేలో ట్రంప్‌ను కమల వెనక్కి నెట్టినట్లు రాయిటర్స్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి బాధ్యత వహిస్తూ అమెరికా సీక్రెట్ సర్వీస్ చీఫ్ కింబర్లీ చీటిల్ రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై ఎటాక్ జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది.
డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగింది. ఆయన కుడి చెవిపై భాగం నుంచి తూడా దూసుకెళ్లింది. అమెరికా 'సీక్రెట్ సర్వీస్' స్నిపర్ దాడి చేసిన వ్యక్తిని వెంటనే హతమార్చారు.
Donald Trump : పెన్సిల్వేనియాలో శనివారం జరిగిన ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. బిగ్గరగా తుపాకీ కాల్పులు వినిపించిన తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని వేదికపై నుంచి దింపారు.
ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఉదయం భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చర్చ జరిగింది.
America : నవంబర్‌లో జరగనున్న అమెరికా ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్ వచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ముఖాముఖి తలపడుతున్నారు.