ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం వచ్చే నెలలో ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ట్రంప్ అధికారంలోకి వస్తే మార్కెట్‌కు కొత్త ఆశలు చిగురిస్తాయని ఆర్థిక నిపుణులు అంతా భావించారు.
TikTok Ban: ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) తన సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ విషయాన్ని సందేశాల ద్వారా తెలియజేస్తోంది. జనవరి 19 నుండి టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి రానుండటంతో, మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘జనవరి 19 నుంచి అమెరికాలో టిక్‌టాక్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం’’ అని టిక్‌టాక్ యూజర్లకు పంపిన సందేశంలో పేర్కొంది. 2017లో ప్రారంభమైన ఈ షార్ట్ వీడియో యాప్‌పై ఇప్పటివరకు…
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా నేపథ్యంలో మరోసారి విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో కెనడా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై జస్టిన్ ట్రూడో తొలిసారి స్పందించారు. తన రాజీనామాను ప్రకటించిన ట్రూడో, కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశం లేదని అన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్యం, భద్రతా…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి పొరుగు దేశం చైనాకు నిత్యం ఇబ్బందికర వార్తలు వస్తూనే ఉన్నాయి. చైనాపై ఎక్కువ టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ గతంలో ప్రకటించారు. దీని వల్ల అమెరికాలో చైనా వస్తువుల రేటు పెరుగుతుంది. దీంతో విక్రయాలు తగ్గి చైనా కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొద్ది రోజుల్లో పదవి నుంచి వైదొలగనున్నారు. దీంతో ఆయన చివరి రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు.
సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు బెదిరిస్తున్న వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదని డొనాల్డ్ ట్రంప్ శనివారం అన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. గత వారమంతా భారీ నష్టాలు కారణంగా లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఈ వారమైనా మార్పు ఉంటుంది అనుకుంటే.. ఈ వారం కూడా అదే తంతు కొనసాగుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
అమెరికా ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అయితే సంప్రదాయబద్ధంగా నూతనంగా ఎన్నికైన ట్రంప్‌తో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు.