ఎట్టకేలకు ఇరాన్ దిగొచ్చింది. అమెరికాతో అణు ఒప్పందం చేసుకొనేందుకే సిద్ధపడింది. అమెరికాతో న్యాయమైన అణు ఒప్పందం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహితుడు అలీ షమ్ఖానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం కళకళలాడుతోంది.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవూర్ రాణా ఢిల్లీ చేరుకున్నాడు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో రాణాను ఢిల్లీకి తీసుకొచ్చారు. రాణాను న్యాయస్థానం ఎదుట హాజరు పరచనున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఒబామాతో కలిసి మిచెల్ రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలసీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం సినిమా రంగంపై కూడా తీవ్రంగా పడనుందని ఇటీవలి చర్చలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఎక్కువగా ఉండే సినిమాలు ఈ మార్పులకు లోనవుతాయని అంచనా. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘SSMB29’ గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ అంచనాలను మించి పెరిగే అవకాశం ఉందని, దీనికి ట్రంప్ ఎఫెక్ట్…
చైనాపై ట్రంప్ విధించిన సుంకాలను టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్ తీవ్రంగా తప్పుపట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మనసు మార్చుకోవాలని ట్రంప్‌ను మస్క్ కోరినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మాట్లాడుతూ.. ఆ రెండు దేశాలు యుద్ధం ఆపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇరు దేశాలు పదే పదే బాంబులు వేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్ కుదేలైపోయింది. అమెరికా మార్కెట్‌తో పాటు అన్ని మార్కెట్లు కకావికలం అయ్యాయి. ఇక ఆసియా మార్కెట్ అయితే అల్లకల్లోలం అయింది. ఇదే అంశంపై ఆదివారం ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నంచగా చాలా తేలిగ్గా తీసుకున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా-మిచెల్ దంపతులు విడిపోతున్నట్లు ఆ మధ్య కాలంలో జోరుగా ప్రచారం సాగింది. విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు వదంతులు నడిచాయి. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిచెల్ హాజరుకాలేదు.. అనంతరం జనవరి 20న జరిగిన ట్రంప్ ప్రమాణస్వీకారానికి కూడా మిచెల్ హాజరుకాకపోవడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.