హమాస్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. తొలి విడత ఒప్పందం ముగిశాక.. సోమవారం ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మందికిపైగా చనిపోయారు. ఇందులో హమాస్ కీలక నేతలంతా ఉన్నారు. ఇక తాజాగా మరోసారి హమాస్‌కు చివరి హెచ్చరిక జారీ చేసింది.
ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న మూడేళ్ల యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ సంభాషించారు. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించారు.
స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లతోపాటు, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ హేగ్, రోస్కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్‌లు భూమి మీదకు సురక్షితంగా వచ్చారు. దీంతో, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మిషన్ విజయవంతంగా పూర్తయింది. వీరి రాకపై స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈసందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం రాజుకుంది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఏడాదికిపైగా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే గాజా సర్వనాశనం అయింది. తాజాగా జరిపిన దాడుల్లో అయితే భారీ స్థాయిలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి శ్రీకారం చుట్టింది. గాజాలో హమాస్ అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు భీకరదాడులకు పాల్పడింది. హమాస్ ఉగ్రవాద సంస్థలపై దాడులు చేయగా 300మంది చనిపోయారు. పదులకొద్దీ గాయాలు పాలయ్యారు. ఇక గాజాతో పాటు దక్షిణ సిరియా, లెబనాన్‌పై కూడా వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా.. 19 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించడానికి ఇప్పటికే శాంతి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా అధికారులు చర్చలు జరిగించాయి. పలుమార్లు జరిగిన చర్చల్లో కీలక పురోగతి లభించింది. ఇక మంగళవారం మరొక కీలక అడుగుపడనుంది.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగింపునకు గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా అధికారులు-రష్యాతో చర్చలు జరుపుతున్నారు. మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని రష్యాను అమెరికా కోరింది. దీనికి ఉక్రెయిన్ సానుకూల సంకేతాలు ఇవ్వగా.. రష్యా నుంచి మాత్రం స్పష్టమైన సమాధానం రాలేదు.
USA-India Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన భారీ ప్రతీకార సుంకాల ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై దీని ప్రభావం ఎంతగానో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ సహా అనేక దేశాలపై అధిక సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ వెల్లడించడంతో వివిధ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో ఆమె…
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఈ నెలలోనే జేడీ వాన్స్ ఫ్యామిలీ భారత్‌ను సందర్శించనున్నట్లు వర్గాలు పేర్కొ్న్నాయి. గత నెలలో జేడీ వాన్స్.. ఫ్రాన్స్, జర్మనీలో తొలి విదేశీ పర్యటన చేశారు. రెండో విదేశీ పర్యటన భారత్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కొత్త టెస్లా కారు కొనుగోలు చేశారు. ఎరుపు రంగు టెస్లా కారును కొనుగోలు చేశారు. అనంతరం కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్‌తో కలిసి ట్రంప్ కలియ తిరిగారు. తన స్నేహితుడికి మద్దతుగా కొత్త టెస్లా కారు కొంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ కారు కొనుగోలు చేసి వైట్‌హౌస్ ఎదుట డ్రైవింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.