US: రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ఢిల్లీనే ఆజ్యం పోస్తోంది.. అమెరికా వాణిజ్య సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు
- రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ఢిల్లీనే ఆజ్యం పోస్తోంది
- అమెరికా వాణిజ్య సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంపై అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదం పరిష్కారం కాకుండా భారతదేశం ఆజ్యం పోస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడంతోనే శాంతికి పరిష్కారం దొరకడం లేదన్నారు. అంతేకాకుండా అమెరికా-భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి కూడా ఢిల్లీ పెద్దల నిర్ణయాలే కారణమని విమర్శించారు. భారత్ వైఖరి కారణంగానే ట్రంప్ 50 శాతం సుంకాలు విధించినట్లుగా పీటర్ నవారో చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Uttarakhand: దారుణం.. క్లాస్ రూమ్‌లో తిట్టాడని టీచర్‌ను కాల్పులు జరిపిన 9వ తరగతి విద్యార్థి
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ప్రస్తుతం భారత్‌పై విధించిన సుంకాల గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదన్నారు. ఆగస్టు 27 నుంచి యథావిధిగా 50 శాతం సుంకం అమలవుతుందని చెప్పారు. మాస్కోతో సంబంధాలు పెట్టుకుని అమెరికాను భారత్ మోసం చేసిందని ఆరోపించారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయక ముందు రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయలేదని.. యుద్ధం మొదలయ్యాకే రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడంతో మాస్కో లబ్ధిపొందుతున్నారు. దీంతో ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రష్యా ఒప్పుకోవడం లేదన్నారు. అమెరికా దిగుమతులపై కూడా భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో దారుణం.. పెళ్లి ఒత్తిడి తేవడంతో మహిళను ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు
ఇక అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత్‌కు చైనా నుంచి ఊహించని మద్దతు లభించింది. 50 శాతం సుంకాన్ని విధించడాన్ని చైనా రాయబారి జు ఫీహాంగ్ తప్పుపట్టారు. ఇక ఆసియాలో ఆర్థిక వృద్ధికి చైనా-భారత్ డబుల్ ఇంజన్లు అన్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ త్వరలో చైనాలో పర్యటన చాలా ముఖ్యమైందన్నారు. ఈ పర్యటనకు చైనా ఎంతో ప్రాముఖ్యతనిస్తోందని చైనా రాయబారి అన్నారు.
ఇది కూడా చదవండి: Nitish Kumar: మదర్సా కార్యక్రమంలో నితీష్ కుమార్ షాక్.. టోపీ ధరించేందుకు నిరాకరణ.. వీడియో వైరల్
భారత్‌పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఆసియాలో అత్యధిక సుంకం విధించింది భారత్‌పైనే. 50 శాతం సుంకంతో టాప్‌లో భారత్ ఉంది.
#WATCH | US | White House Trade Adviser Peter Navarro says, "In India, 25% tariffs were put in place because they cheat us on trade. Then 25% because of the Russian oil… In many ways, the road to peace runs through New Delhi…"
He said, "Prior to Russia's invasion of Ukraine… pic.twitter.com/DxT7oUrpPV
— ANI (@ANI) August 21, 2025
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..