భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు నడిచాయి. భారత్ మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ సుంకాలు కారణంగా ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత భారత్‌పై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా భారత్‌పై మరో 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. దీంతో ఆసియాలోనే భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టింది.
ఇది కూడా చదవండి: Rajasthan: వరకట్న పిశాచికి మరొకరు బలి.. కుమార్తెతో సహా లెక్చరర్ సజీవదహనం
అయితే కొత్త సుంకం ఆగస్టు 27 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసు పంపించింది. ఆగస్టు 27న అర్ధరాత్రి నుంచి 50 శాతం సుంకం అమలవుతున్నట్లుగా నోటీసులో స్పష్టం చేసింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 6న సంతకం చేయబడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు 14329ను అమలు చేస్తున్నట్లు నోటీసులో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Upasana : హోదా కాదు, కీర్తి కాదు.. నన్ను నేను నిలబెట్టిన శక్తి ఇదే
ఇదిలా ఉంటే ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇరు దేశాధినేతలతో చర్చలు జరిపారు. కానీ చర్చలు కొలిక్కి రావడం లేదు. పుతిన్ షరతులు విధించడంతో సమస్య పరిష్కారానికి రావడం లేదు. ఈ నేపథ్యంలో రష్యాతో సంబంధాలు పెట్టుకున్న దేశాలపై భారీ సుంకాలు విధించి ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. అలాగే మిగతా దేశాలపై కూడా సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే చైనా కూడా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనాపై మాత్రం జరిమానా విధించలేదు. కేవలం భారత్‌పైనే భారీ సుంకం విధించారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ సోమవారం అహ్మదాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల కోసం ఎంత ఒత్తిడైనా తట్టుకుంటామని.. కావాల్సినంత శక్తిని పెంచుకుంటామని చెప్పారు. చిన్న వ్యాపారవేత్తలు, రైతులు, పశువుల పెంపకందారులకు ప్రభుత్వం హాని చేయదని చెప్పారు. ఇక ఇదే అంశంపై మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం అత్యున్నత సమావేశం నిర్వహిస్తోంది. 50 శాతం సుంకాల కారణంగా ఎదురయ్యే పరిస్థితులపై అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు.