Trump-Modi: మోడీకి ఫోన్ చేసి బెదిరించా.. పాక్‌తో యుద్ధం ఆపేశారు.. ట్రంప్ మళ్లీ అదే పాట
- మోడీకి ఫోన్ చేసి బెదిరించా
- పాక్‌తో యుద్ధం ఆపేశారు
- ట్రంప్ మళ్లీ అదే పాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచం వ్యాప్తంగా ఆరు యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే చెబుతుంటారు. ఇదే క్రమంలో భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపానంటూ ట్రంప్ ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలను భారత్ పలుమార్లు ఖండించింది. ఇరు దేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగిందని భారత్ చెబుతూనే ఉంటోంది. కానీ ట్రంప్ మాత్రం లేదు.. లేదు యుద్ధాన్ని ఆపింది తానేనంటూ చెప్పుకొస్తున్నారు. తాజాగా మరోసారి వైట్‌హౌస్ వేదికగా మంగళవారం అవే వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: UP: వరకట్న దాహానికి మరో అబల బలి.. భార్యను చంపిన కానిస్టేబుల్
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
మంగళవారం వైట్‌హౌస్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తిరిగి భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. భారత ప్రధాని మోడీకి స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారు. ‘‘ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడాను. పాకిస్థాన్‌తో మీకు జరుగుతుందని మోడీని అడిగాను. ఆ తర్వాత పాక్‌తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పు ఉందని భావించా. అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్, పాక్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ సుంకాలతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. కానీ ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: టారిఫ్ ఉద్రిక్తతలు.. ట్రంప్ ఫోన్ కాల్స్ పట్టించుకోని మోడీ.. ఎన్ని సార్లు చేశారంటే..!
ట్రంప్ ప్రకటనలను భారత్ పదే పదే ఖండిస్తోంది. అయినా కూడా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని భారత్ ఇప్పటికే పలుమార్లు చెప్పింది. కానీ ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్టుగా ట్రంప్ వ్యవహార శైలి ఉంటుంది.
ఇదిలా ఉంటే బుధవారం భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. ఈ సుంకాలు కారణంగా అమెరికాతో దాదాపు సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రష్యా, చైనాతో భారత్ సంబంధాలు పెంచుకుంటోంది. చైనాతో సంబంధాలు బలపడితే భారత్ ఆర్థికంగా పుంజుకోవచ్చని తెలుస్తోంది.
#WATCH | "…I am talking to a very terrific man, Prime Minister of India, Narendra Modi. I said what's going on with you and Pakistan. Then I am talking to Pakistan about trade. I said what's going on with you and India? The hatred was tremendous. This has been going on for a… pic.twitter.com/gJVOTmKjXN
— ANI (@ANI) August 27, 2025
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!