రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్, చైనాపై ట్రంప్ కారాలు.. మిరియాలు నూరుతున్నారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనాపై కూడా వేసేందుకు ట్రంప్ సిద్ధపడుతున్నారు. ఇలాంటి తరుణంలో మోడీ, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదికపై ప్రత్యక్షం కాబోతున్నారు. చైనా వేదికగా ఈ ముగ్గురు వచ్చే వారం కలవబోతున్నారు. ఇందుకు సంబంధించిన వార్త ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి: DK Shivakumar: గాంధీ కుటుంబమే నాకు దేవుడు.. ఆర్ఎస్ఎస్ గీతాలాపనపై శివకుమార్ క్లారిటీ
టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశానికి పుతిన్, మోడీని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు. దీంతో వచ్చే వారం ఈ ముగ్గురు కలవబోతున్నారు. ఇక ఏడు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి చైనాలో పర్యటించబోతున్నారు. ప్రపంచ దక్షిణ సంఘీభావాన్ని ప్రదర్శించేందుకు చైనా అధ్యక్షుడు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: అన్నామలైకు ఓ మంత్రి కుమారుడు షాక్.. స్టేజ్‌పై ఎంత పని చేశాడంటే..!
వచ్చే వారం చైనాలో జరిగే ప్రాంతీయ భద్రతా వేదికలో 20 మందికి పైగా ప్రపంచ నాయకులు సమావేశం కానున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉత్తర ఓడరేవు నగరం టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల నాయకులను జిన్‌పింగ్ ఆహ్వానించారు.
2020లో సరిహద్దు ఘర్షణల కారణంగా భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య తిరిగి సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. ఇటీవలే విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా వెళ్లొచ్చారు. తిరిగి ఏడేళ్ల తర్వాత మోడీ తొలిసారిగా చైనాలో అడుగుపెట్టబోతున్నారు.
గత వారం ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయ అధికారులు మాట్లాడుతూ.. చైనా-భారతదేశంతో త్రైపాక్షిక చర్చలు త్వరలో జరుగుతాయని మాస్కో ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లు పరిశోధనా సంస్థ ది చైనా-గ్లోబల్ సౌత్ ప్రాజెక్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎరిక్ ఒలాండర్ అన్నారు.
2001లో SCO స్థాపించబడినప్పటి నుంచి ఈ సంవత్సరం జరిగే శిఖరాగ్ర సమావేశం అతిపెద్దది అవుతుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి అన్నారు. ఈ కూటమి కొత్త రకమైన అంతర్జాతీయ సంబంధాలను నిర్మించడంలో ముఖ్యమైన శక్తిగా ఎదుగుతుందని అభివర్ణించారు.