ఇవాళ మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. ఉదయం 11.00 గంటలకు మెదక్ లోని 100 పడకల మతాశిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు దళిత బంధు పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు వాహనాలను హరీష్ రావు అందజేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేసి, మధ్యాహ్నం 1:30 గంటలకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. Bank Robbery:…
వరి కోతలు ముగిసి రోజులు గడుస్తున్నా… ఇంకా వడ్లు కల్లాల్లోనే ఉన్నాయి. దీంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ లు చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినా… అందుకు తగ్గట్లు కొనుగోలు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు షాక్ ఇచ్చారు రైతులు. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో…
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూలేనంతగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి. క్యాస్ట్ కుంపట్లతో చలి కాచుకునేందుకు చాలామంది నేతలు శతవిధాలా చిచ్చు రగిలిస్తున్నారు. తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో, లేదంటే ఒక కులాన్ని రెచ్చగొట్టి, మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు. నిజాయితీగా ప్రజల జీవితాలు బాగుచెయ్యడానికి, వారీ జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ఇదిగో ఇలాంటి పథకాలు తెస్తాం, అలాంటి కార్యక్రమాలు చేస్తామన్న హామీలను చెప్పడం లేదు. కులాల భావోద్వేగాలను అస్త్రాలుగా సంధిస్తున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలిటికల్ పార్టీలు స్పీడ్ పెంచాయి. రాహుల్‌గాంధీ సభ తర్వాత దూకుడుగా వెళ్తోంది కాంగ్రెస్. బీజేపీ కూడా పట్టు పెంచుకోవడానికి చూస్తోంది. ఇదే సమయంలో ఆధిపత్యాన్ని నిలుపుకొనే పనిలో గట్టిగానే పావులు కదుపుతోంది అధికార టీఆర్‌ఎస్. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్ స్ట్రాంగ్‌గా ఉంది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు.. పార్టీ నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని టీఆర్‌ఎస్ పెద్దల నుంచి సూచనలు వెళ్లాయి. దీంతో గత 20 రోజులుగా ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పనిలో…
తెలంగాణ కాంగ్రెస్‌లో వలసల స్పీడ్ పెంచుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఓదెలు ఆయన భార్య కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కానీ.. ఎప్పటి నుంచో వస్తారు.. వస్తారు అని ప్రచారం జరిగిన ధర్మపురి శ్రీనివాస్ పరిస్థితి మాత్రం కొలిక్కి రావడం లేదు. ఆయన వస్తున్నారా? ఆగిపోయారా? అనేది ఎటూ తేలలేదు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా… సోనియాగాంధీని కలిసి పార్టీలోకి వస్తా అని చెప్పారు DS. ఆయన విన్నపానికి మేడం క్లియరెన్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అప్పట్లో పీసీసీ…
కరోనా కల్లోలమో, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమో, రెండూ కలిసి దరువేశాయోగానీ, ధరల మోత సామాన్యుల బతుకులను బండకేసి బాదింది, బాదుతోంది. ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో పైపైకి ఎగబాకుతోంది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదంటూ కామన్ మ్యాన్ కష్టాల రాగం ఆలపిస్తున్నాడు. ఇలా రేట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టైంలో, కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ రిలీఫ్ ఇచ్చింది. పేస్ట్ నుంచి పడుకునే బెడ్ వరకు అన్ని ధరలు ప్రభావితమయ్యే పెట్రో రేట్లను కూసింతో, కాసింతో తగ్గించింది. లీటర్…
తమిళనాడులో సుపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతే ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో విజయ్. బాలనటుడిగా సినీ ప్రవేశం చేసిన విజయ్ తక్కువ కాలంలోనే స్టార్‌డమ్ సాధించారు. సేవా కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి హీరో అడుగులు తమిళనాడుతోపాటు ప్రస్తుతం తెలంగాణలోనూ చర్చగా మారాయి. విజయ్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. జయలలిత మరణం తర్వాత విజయం రాజకీయ అరంగేట్రం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. దానికి ఇంకా సమయం ఉందని…
రాజ్యసభ స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల దరఖాస్తు ప్రారంభంకానుంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా దామోదర్‌రావు, బండి పార్థసారధిరెడ్డి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా టీఆర్‌ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. Read Also:…
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు తెలంగా సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 20 జాతీయ పర్యటనకు వెళ్లారు. అయితే ఆయన పర్యటన ఈ నెలాఖరు వరకు కొనసాగిల్సి ఉండగా మధ్యలోనే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 20న ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఈ నెల 21న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 22న ఢిల్లీ సీఎం కేజీవాల్‌తో…
అక్కంపేట రచ్చబండలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం రేవంత్ జోకర్ మాటలు మాట్లాడుతున్నారని, జయశంకర్ సార్ గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ బండికి జయశంకర్, కేసిఆర్‌లు జొడెడ్లలాగా పనిచేశారన్నారు. ఉద్యమ సమయంలో చంద్రబాబు రాసిన స్క్రిప్ట్‌లో రేవంత్ ఓ పాత్రదారుడని అన్నారు. తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదని మండిపడ్డారు. రైతు…