TRS : హీరో విజయ్ అడుగులపై తెలంగాణలోనూ చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో సుపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతే ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో విజయ్. బాలనటుడిగా సినీ ప్రవేశం చేసిన విజయ్ తక్కువ కాలంలోనే స్టార్‌డమ్ సాధించారు. సేవా కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి హీరో అడుగులు తమిళనాడుతోపాటు ప్రస్తుతం తెలంగాణలోనూ చర్చగా మారాయి. విజయ్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. జయలలిత మరణం తర్వాత విజయం రాజకీయ అరంగేట్రం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. దానికి ఇంకా సమయం ఉందని ఆ ప్రచారానికి అప్పట్లో తెరదించారు విజయ్.
ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టేనని హీరో విజయ్ భావిస్తున్నట్టు ఉన్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీపై మంతనాలు చేపట్టేశారట. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు దఫాలుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో విజయ్ రహస్యంగా చర్చలు జరిపారు. ఆ చర్చలపై తమిళనాడులో వేడీ వేడీ చర్చ జరుగుతూనే ఉంది. ఇదే సమయంలో నేరుగా ప్రగతిభవన్‌కి వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు హీరో విజయ్. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారట. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ అజెండాపై ప్రయత్నాలు మొదలుపెట్టిన కేసీఆర్‌తో విజయ్ భేటీ ఉత్కంఠ పెంచింది.
Also Read
విజయ్ ఎందుకు హైదరాబాద్ వచ్చారు? సీఎం కేసీఆర్‌తో ఏం మాట్లాడారు అనే దానిపై తమిళనాడులోనూ ఆసక్తి పెరుగుతోందట. ఇద్దరి మధ్య ప్రశాంత్ కిశోర్ ప్రస్తావన ఉండటంతో రాజకీయంగా జరగబోయే పరిణామాలపై రకరకాల ఊహాగానాలు చర్చల్లో ఉన్నాయి. ఆ మధ్య తమిళనాడు వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. అదే స్టాలిన్‌కు తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో DMK వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిశోర్. ఇదే పీకే ప్రస్తుతం టీఆర్ఎస్‌కూ సేవలు అందిస్తున్నారు. హీరో విజయ్‌కు కూడా ప్రశాంత్ కిశోర్ ఏదో విలువైన సూచనే చేసి ఉంటారని సమాచారం. ఆ వ్యూహంలో భాగంగానే సీఎం కేసీఆర్‌తో విజయ్ సమావేశమైనట్టు తెలుస్తోంది. అయితే కొత్తపార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌తో చర్చించారా? లేక ప్రత్యామ్నాయ అజెండాతో కలిసి సాగేందుకు మాటలు కుదిరియా అనేది సస్పెన్స్.
ఇక నటుడు ప్రకాశ్‌రాజ్ ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో కలిసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. కొందరు ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు కూడా సమావేశం అయ్యారు. బీజేపీ వ్యతిరేకశక్తులతో కలిసి పనిచేస్తానని బహిరంగంగానే ప్రకటించారు ప్రకాశ్‌రాజ్. ఇప్పుడు హీరో విజయ్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందుకే హీరో విజయ్ అడుగులు ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కేసీఆర్‌తో ప్రత్యామ్నాయ అజెండాపై కలిసినడుస్తారా? లేక కేవలం 2026లో జరిగే తమిళనాడు ఎన్నికలకే పరిమితం అవుతారా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!