గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదికను హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సంక్షోభం తర్వాత సాధారణ స్థితికి రావడానికి అనేక రంగాలు ఆపసోపాలు పడుతుంటే.. తెలంగాణలో ఐటీ రంగం శర వేగంగా దూసుకుపోతుందని, గత రికార్డులను బద్దలు కొడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను…
ఆర్టీసీ నష్టాల్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టి కాపాడుకుంటోందని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి చెమట చుక్క విలువ తెలియని ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించదని అన్నారు. కేంద్రం మాత్రం ఉన్న సంస్థల్ని అమ్ముకుంటోందని.. కార్మికులకు లాభం చేకూర్చే 40 చట్టాలను తీసేసి కేవలం నాలుగు కార్మిక చట్టాలను తెచ్చారని విమర్శించారు. కార్మికుల హక్కులను హరించే ఈ నాలుగు చట్టాలను తీసేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్లకు బీజేపీ…
ప్రపంచంలో పాల ఉత్పత్తిలో దేశం నెంబర్ గా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డబ్బా ఇల్లు వద్దు అన్న తెలంగాణ ప్రభుత్వం.. 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్ని ఇళ్ళు కట్టినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధిని 21 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు. దేశ…
ఆపదలోనైనా ప్రజలకు మేమున్నామంటూ చేదోడుగా నిలిచి, తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా, సాహిత్యం అవార్డుల ప్రధానోత్సవ సమావేశం జరిగింది. ఆర్‌ఎస్‌ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి…
ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం కెసిఆర్ డబ్బులు ఇచ్చినట్లు బండి సంజయ్ ఒప్పుకుంటున్నాడా? అని చురకలంటించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని ప్రశ్నించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు యంత్రాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని బండి సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సామాగ్రిని కేంద్ర ఆధీనంలో ఉన్న బిహెచ్‌ఇఎల్ ఇచ్చిందన్నారు. టెండర్ల ద్వారా బిహెచ్‌ఇఎల్…
ఘట్‌కేసర్‌లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెడ్డి సింహగర్జన సభకు హాజరయ్యారు మంత్రి మల్లారెడ్డి. అప్పటి వరకు బాగానే సాగిన మంత్రి మల్లారెడ్డి స్పీచ్ పై అక్కడ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ పథకాలను ఆయన వివరించడంతో పరిస్థితి మారిపోయింది. ప్రసంగం తర్వాత సభ నుంచి తిరిగి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్‌పై కొందరు దాడి చేయడం రాజకీయ వేడి రగిలించింది. ఈ దాడి వెనక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మనుషులు ఉన్నారని ఆరోపించారు…
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మాటలను, నాయకులు, అధికారుల మాటలను పట్టించుకునే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. బొగ్గు దిగుమతి అంశంలో కేసీఆర్ ప్రజలను పక్కదోవ పట్టించారని అన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి విచ్చల విడి అవినీతితో తెలంగాణను అప్పు ల పాలు చేశారని.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం సంస్థల నుంచి అప్పులు తెచ్చాడని.. కొత్తగా అప్పులు వచ్చే పరిస్థితి…
ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగినప్పుడు.. టిడిపి నేతలు,శ్రేణులు పాల్గొనేవారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన కుటుంబసభ్యులు.. ఇటు తెలంగాణ టిడిపి శ్రేణులు జయంతి ,వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్బంగా తెలంగాణలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మారుతూ వచ్చాయి. తెలంగాణలో క్రమంగా టిడిపి…
తెలంగాణ బీజేపీకి తొమ్మిది మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. ఇందులో ముగ్గురు గతంలో నియమితులు కాగా.. రీసెంట్ గా మరో ఆరుగురునీ నియమించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అధికార ప్రతినిధుల ప్రధాన బాధ్యత.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల పై, సంఘటనల పై స్పందించడం… వివిధ అంశాల పై పార్టీ వైఖరి ఏంటో చెప్పడం. దీంతో పాటు సీనియర్ నేతల మీడియా సమావేశాలు ఉంటే.. ముందే మెటీరియల్ సమకుర్చడం.. బ్యాక్ ఆఫీసు సపోర్ట్ గా…