తెలంగాణలో ఇటీవల కాలంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ట్విట్టర్ వేదికగా ఎండగడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ వరసగా ట్వీట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలపై 8 ప్రశ్నాస్త్రాలు సంధించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ ఉంది మోడీ జీ? అంటూ ప్రశ్నించారు. దేశ జీడీపీ పడిపోతుంటే పెరిగిన…
కొన్ని రోజుల నుంచి తెలంగాణ సర్కార్‌పై విజృంభిస్తోన్న బండి సంజయ్ కుమార్.. ఇప్పుడు సర్పంచ్‌లతో కలిసి సమరభేరీకి సిద్ధమవుతున్నారు. జూన్ తొలి వారంలో వారితో కలిసి మౌన దీక్షకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ వేదికగా సర్పంచ్‌లతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి రెండు గంటల పాటు మౌన దీక్ష చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా, ఇంకా ఆలస్యం చేస్తుండడంతో.. బిల్లులు ఇచ్చేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన ఈ దీక్షకు పూనుకున్నారు. అదేరోజు…
తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఆనాడు ఏ ప్రభుత్వమూ ఆలోచించలేదని, రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గ్రామాలు ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మండువేసవిలో కూడా నీరు ఇచ్చిన ఘనత ఒక్క కేసీఆర్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందు కరీంనగర్‌లో తాగు, సాగునీటి కోసం అష్టకష్టాలు పడేవాళ్ళమని గుర్తు చేశారు. ఆనాడు కరెంట్ కావాలని తాను…
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాన రాష్ట్రం దివాళా దిశగా సాగుతోందని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి 80 శాతం ఆదాయం వస్తోన్నా.. అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. పేదలు నివసించే ప్రాంతాల్లో రోడ్లన్నీ గతుకులమయంగా ఉన్నాయని.. జీహెచ్‌ఎంసీ, జలమండలి ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో తెలంగాణ సర్కార్ ఉందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలో విసిగిపోయారన్న ఆయన.. ఎనిమిదేళ్ళ మోదీ పాలనపై…
ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా వేయి కిలోమీటర్లు పూర్తి చేసుకుని ప్రతిక్షణం, ప్రతిరోజు రైతుకోసం చేస్తున్న రైతుగోస ధర్నాలో పాల్పంచుకున్న అందరికి ధన్యావాదాలు తెలిపారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సదాశివునిపేటలో రైతుగోస ధర్నాలో పాల్గొన్నషర్మిల సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పంట వేయని రైతులకు ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని, దొంగ హామీలు ఇచ్చేందుకు…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం. ఇక్కడి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. టీఆర్ఎస్ నుంచి వరసగా రెండోసారి ఎమ్మెల్యే. 2014లో గెలిచిన తర్వాత పెద్దగా వివాదాలు రాకపోయినా.. 2018లో గెలిచాక మాత్రం పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయని కేడర్ చెవులు కొరుక్కుంటోంది. టీఆర్ఎస్ కేడర్‌తోపాటు.. ప్రజలకు ఎమ్మెల్యే దూరం అయ్యారని టాక్ నడుస్తోంది. సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా భాస్కరరావు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి టర్మ్‌లో భాస్కరరావుకు తోడుగా ఆయన…
సీఎం కేసీఆర్ గతంలో కూడా ప్రళయం సృష్టిస్తా.. పీఎంను దేశం నుండి తరిమేస్తా.. బీజేపీ నీ బంగళా ఖాతంలో కలిపేస్తానంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓవైసీ నేను కలిసి దేశమంతా పర్యటిస్తా అన్నారు… ఫెడరల్ ఫ్రంట్ అన్నారు ముందు మీ పార్టీలో గుణాత్మక మార్పు రావాలి, కేసీఆర్ వ్యవహారంలో గుణాత్మక మార్పు రావాలి అంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీని విమర్శించే నైతిక హక్కు…
అమిత్ షా మాటలను మరోసారి నరేంద్రమోదీ రిపీట్ చేశారు అంతే.. అంటూ.. ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. నిన్న జరిగిన మోడీ హైదరాబాద్ పర్యటలో భాగంగా.. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనపై మోడీ ప్రస్తావించడంతో.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. మోడీ మాటలకు ఈ సందర్భంగా చురకలంటించారు. నరేంద్రమోదీ మాటలను టీఆరెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నరేంద్రమోదీ పచ్చివ్యతిరేకి అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం…
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక రాజకీయ రగడగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును ఈ పథకానికి సంబంధించి నియోజకవర్గంలో ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలదే కావడంతో.. ఆయన రోల్ కీలకంగా మారిపోయింది. దీనిని మంథనిలోని టీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారట. కాంగ్రెస్ కార్యకర్తలకే ఎమ్మెల్యే దళితబంధు ఇప్పిస్తున్నారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌డివిజన్‌లో అధికారపార్టీ నేతలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారట. ఈ పథకాన్ని ముందుగా టీఆర్ఎస్…