పట్టణాలతో పల్లెలు పోటీ పడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని.. ఆ సంకల్పం నెరవేరినందునే కేంద్రం నుండి గ్రామపంచాయతీలకు అవార్డులు వచ్చాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి అవార్డులు రావడాన్ని తట్టుకోలేకే అణిచివేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని అన్నారు. డిస్కంలకు లోన్లు మంజూరు కాకుండా అడ్డుపడడం అందులో భాగమే అని ఆరోపించారు. కేంద్రం కరెంట్ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ఇన్ని…
అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే.. ఇరు పార్టీలు తెలంగాణలో ఎన్నికల తరహా వాతావరణాన్ని తీసుకువచ్చాయి. తాజాగా తెలంగాణ ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ డెవలఫ్మెంట్ కు కేంద్రం మోకాలడ్డు పెడుతుందని టీఆర్ఎస్ అంటుంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కప్పగా మార్చారంటూ బీజేపీ ఫైర్ అవుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్…
“మీకు ఏం కావాలో అన్ని మేము ఇస్తున్నాం. మీరు చేయాల్సింది ఉద్యోగం సంపాదించడం మాత్రమే” అన్నారు. ఉచితంగా ఆన్లైన్ క్లాసుల యాప్ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లోని రాజీవ్ గాందీ ఆడిటోరియంలో.. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు సొంత ఖర్చులతో రూపొందించిన ఆన్ లైన్ వీడియో యాప్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి సీపీ నాగారాజు కలిసి ప్రారంభించారు. తెలంగాణ వస్తే రాష్ట్రం…
75సంవత్సరాలలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రమూ సాధించని విజయాలను ఎనిమిదేండ్లలోనే తెలంగాణ సాధించిందని కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద అమర వీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో.. పాలుపంచుకున్న వారందరికి ప్రత్యేక వందనాలు…
తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలు బీజేపీ ఆధ్వర్యంలోని కాషాయ జెండాతోనే నేరవేరతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ అమర వీరులను స్మరించుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ఛిన్నాభిన్నమైందని ఆవేదన…
పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ముస్తాబైంది. ఆవిర్భావ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోవిడ్–19 మహమ్మారితో రెండేళ్ల విరామం తర్వాత నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌కు వెళ్లడానికి ముందు సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. గవర్నర్ తమిళిసై…
కొందరు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఐటీ మంత్రి చైనాను పొగుతున్నారని.. అక్కడ ఉన్నది మిలిటరీ రూల్ అని తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రధాన మంత్రి గురించి ఇక్కడ మాట్లాడినట్లు అక్కడ మాట్లాడితే ఊరుకోరని అన్నారు. కరోనాతో చనిపోయిన వారి లెక్కలు కూడా చైనా చెప్పదని.. చైనా ప్రభుత్వం చెప్పిందే రాసుకోవాలని తెలిపారు. కేటీఆర్ గొప్పగా చెబుతున్న చైనాలో ముస్లింలను చంపుతున్నారని.. అక్కడి ప్రభుత్వానికి…
2018లో కేంద్రంలో చక్రం తిప్పుతా అని వెళ్లిన ముఖ్యమంత్రి బొక్కబోర్ల పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. హనుమకొండ జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించి, హనుమకొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పరిపాలించడం చేతకాక సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఎవరు పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల సీఎంల వద్ద…